Homeప్రవాస భారతీయులుRoad Accident: రోడ్‌ యాక్సిడెంట్‌.. ఎన్‌ఆర్‌ఐ రిమాండ్‌.. ఫారినర్స్‌ రిలీజ్‌!

Road Accident: రోడ్‌ యాక్సిడెంట్‌.. ఎన్‌ఆర్‌ఐ రిమాండ్‌.. ఫారినర్స్‌ రిలీజ్‌!

Road Accident: హైదరాబాద్‌లో అతిగా మద్యం సేవించి బెంజ్‌ కారు నడుపుతూ.. ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన ఎన్‌ఆర్‌ఐకి జడ్జి 14 రోజుల రిమాండ్‌ విధించారు. అదే కారులో ప్రయాణిస్తున్న మిగతా నలుగురు విదేశీయులకు వెయిల్‌ మంజూరు చేశారు.

ఏం జరిగిందంటే..
జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45లో ఉంటున్న అవినాష్‌ అనే ఎన్‌ఆర్‌ఐ తన సోదరుడి వివాహానికి ఏప్రిల్‌ 20న అమెరికా, జర్మనీలోని నలుగురు స్నేహితులతో కలిసి హైదరాబాద్‌కు వచ్చాడు. వారు బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో బస చేశారు. మంగళవారం రాత్రి వీరు బంజారాహిల్స్‌ కారా పబ్‌లో మద్యం సేవించి బుధవారం తెల్లవారుజామున బెంజ్‌కారులు పార్క్‌ హయత్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో కారు అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది.

ఐదుగురిపై కేసు..
ఈ యాక్సిడెంట్‌కు సంబంధించి పోలీసులు కారు నడిపిన అమెరికాలో నివసించే టార్గెట్‌ సెక్యూరిటీ సీఈవో ఈతెన్‌ వెంకటేశ్, కారులో ఉన్న ఎన్‌ఆర్‌ఐ అవినాష్‌ చలసాని, దుబాయ్‌కు చెందిన సాషా, జర్మనీకి చెందిన మ్యాక్‌మిలన్‌ హెన్రీ రాడింగర్, అమెరికాలో ఉంటున్న సాయిప్రియతమ్‌ కాశంపై కేసు నమోదు చేశారు. నిందితులను బుధవారం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రిమాండ్‌కు తిరస్కరించి గురువారం తీసుకురావాలని ఆదేశించింది.

రిమాండ్‌ విధించిన మేజిస్ట్రేట్‌..
గురువారం 17వ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట నిందితులను హాజరు పరాచరు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రధాన నిందితుడు వెంకటేశ్‌కు రెండు వారాల రిమాండ్‌ విధించారు. మిగతా వారికి బెయిల్‌ మంజూరు చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు ఘటనాస్థలంలోనే వీరికి డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టు నిర్వహించారు. వెంకటేశ్‌కు 360 బీఏసీ (బ్లడ్‌ ఆల్కాహల్‌ కంటెంట్‌)గా నమోదైంది. మిగతా నలుగురు కూడా మద్యం తాగినట్లు నిర్ధారించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper