Homeబిజినెస్Central Govt Schemes: రైతులకు ఉపయోగపడే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇవే..

Central Govt Schemes: రైతులకు ఉపయోగపడే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇవే..

Central Govt Schemes:  భారతదేశానికి రైతు వెన్నెముక అంటారు. ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు ప్రాధాన్యత ఇస్తుంది. దేశంలో చాలా బూభాగం వ్యవసాయంతో నిండి ఉన్నందున రైతులు ఈ రంగంపైనే ఎక్కువగా ఆధారపడుతారు.  అయితే రైతులు నష్టపోయిన సందర్భంలో అవసరమైన ఆహార పదార్థాలు మార్కెట్లోకి రావు. దీంతో ఆహార కొరత ఏర్పడి ధరలు పెరుగుతాయి. అందువల్ల రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వాలు వివిధ పథకాలు ప్రవేశ పెడుతాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం రైతులకు అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టింది. వాటి గురించి వివరాల్లోకి వెళితే…

పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పేరిట ఉన్న ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం చేస్తుంది. ఏడాది పాటు రూ.6000 ఇస్తుంది. ఇవి ప్రతీ క్రాప్ సమయంలో రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2000 చొప్పున యాడ్ అవుతాయి. చాలా మంది రైతులు పెట్టుబడుల సమయంలో సమయానికి డబ్బు అందదు. దీంతో అప్పులు చేసి పంటలు వేస్తారు. ఒకవేళ పంట నష్టపోతే అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని పెట్టుబడి సాయం కింద దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2023 డిసెంబర్ వరకు 107 మిలియన్ల మంది ఈ పథకాన్ని లబ్ధి పొందారు.

కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే మరో పథకం ప్రధానమంత్రి పసల్ బీమా యోజన.రైతులు ఎంతో ఆశతో తీవ్రంగా శ్రమించి పంటలు వేస్తారు. కానీ ప్రకృతి వైఫరీత్యాల వల్ల పంటలు తీవ్రంగా నష్టపోతారు. అలాగే తెగుళ్లు, తదితర కారణాలతో పంటలు దెబ్బతింటాయి.  ఇలాంటి సమయంలో రైతులకు తోడుగా ఉండేందుకు ఈ పథకం ద్వారా సాయం చేస్తారు. అయితే ముందుగా ఇందులో పేరు నమోదు చేసుకుంటే ఆ ఏడాదిలో నష్టం జరిగితే పరిహారం చెల్లిస్తారు. కొన్ని రాష్ట్రాలు దీనిని అమలు చేస్తున్నాయి.

రైతుల కోసం ప్రత్యేకంగా క్రెడిట్ కార్డులను అందిస్తున్నారు. దీనినే కిసాన్ క్రెడిట్ కార్డు అంటారు. 1998లో దీనిని ప్రారంభించారు. రైతులు తమ వ్యవసాయ ఖర్చుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఎరువు, విత్తనాలు కొనుగోలు చేయొచ్చు. కొన్ని రోజుల వ్యవధితో వడ్డీ లేకుండా దీని ద్వారా నగదు సాయం చేస్తారు. ఖర్చులు మాత్రమే కాకుండా రైతులు క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు కూడా తీసుకోవచ్చు. వీటిపై 4 శాతం వడ్డీ రాయితీ అందిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Toxic Movie

Toxic Movie: ‘టాక్సిక్’ నుండి మరో హాట్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది.. ఈసారి డోస్ బాగా తగ్గించేశారుగా!

Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం 'టాక్సిక్' వచ్చే నెల ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్ల గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన...
Nagarjuna

Nagarjuna: ‘లెనిన్’ ని ఆ రేంజ్ కి తీసుకెళ్లలేకపోయాము అంటూ నాగార్జున హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ 'లెనిన్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 12 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ , అక్కినేని అఖిల్ ఈ చిత్రం తో భారీ బ్లాక్...
Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...
Himalayan Disaster

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...
Divvela Madhuri

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Oktelugu Epaper