Janhvi Kapoor And Nani: వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్న నాని(Natural Star Nani), ఈసారి తన రేంజ్ ని పెంచుకుంటూ ‘ది ప్యారడైజ్'(The Paradise Movie) అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తనతో ‘దసరా’ లాంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చ్ 26 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం లో నాని ఒక పక్క హీరో గా నటిస్తూనే, మరోపక్క నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. హీరో గా ఆయనకు ఫెయిల్యూర్స్ ఉన్నాయి కానీ, నిర్మాతగా మాత్రం నాని కి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేదు. ఇది ఒక ట్రాక్ రికార్డు అని చెప్పొచ్చు. ఇక ‘ది ప్యారడైజ్’ చిత్రం కోసం ఆయన బడ్జెట్ విషయం లో ఎక్కడా వెనకడుగు వేయడం లేదు.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో హీరోయిన్ గా ‘డ్రాగన్’ ఫేమ్ కాయదు లోహర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆమె కంటే ముందుగా ప్రముఖ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ని సంప్రదించారట మేకర్స్. కానీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో నటించడానికి రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అందుకు కారణం ఆమె భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం వల్లే అని అంటున్నారు. తెలుగు లో ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు పది కోట్ల రూపాయలకు పైగానే రెమ్యూనరేషన్ అందుకుంటూ వస్తుంది. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఆమె చేస్తున్న ‘పెద్ది’ చిత్రం కోసం కూడా ఆ రేంజ్ లోనే రెమ్యూనరేషన్ అందుకుంటుంది. అదే రెమ్యూనరేషన్ ఇక్కడ కూడా డిమాండ్ చేయడం తో నాని అందుకు సానుకూలత చూపకపోవడం వల్లే ఈ సినిమా నుండి ఆమె తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ అందిస్తున్నాడు. అదే విధంగా మంచు మోహన్ బాబు ఈ చిత్రం లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ చిత్రం లో హీరో నాని కి స్నేహితుడిగా సంపూర్ణేష్ బాబు నటిస్తున్నాడు. ఆ పాత్ర పేరు బిర్యాని. రీసెంట్ గానే ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి బంపర్ రెస్పాన్స్ వచ్చింది.