Actor Nani: బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి ఇటీవల ప్రభాస్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కల్కి సినిమాలో ప్రభాస్ లుక్ జోకర్ లా ఉందంటూ ఎగతాళి చేశాడు. ప్రభాస్ ని ఇలా చూడడం బాధగా ఉంది. ఆయన్ని మ్యాడ్ మ్యాక్స్ తరహా మూవీలో చూడాలనుకుంటున్నాను, అన్నాడు. అర్షద్ వార్సీ మాటలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. అర్షద్ వార్సి కామెంట్స్ ని ఖండిస్తూ పలువురు టాలీవుడ్ ప్రముఖులు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. ఈ వివాదం కాస్త చిలికి చిలికి గాలి వానైంది. టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అన్నట్టుగా సోషల్ మీడియాలో కోల్డ్ వార్ నడుస్తోంది.
తాజాగా నాని ముంబైలో ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అర్షద్ వార్సి-ప్రభాస్ అంశంపై స్పందించిన నాని ఇన్ డైరెక్ట్ గా కౌంటర్లు వేసాడు. ‘ మీరు చెబుతున్న వ్యక్తికి జీవితంలో ఇంత పబ్లిసిటీ ఇప్పుడే వచ్చిందనుకుంటా .. మీరు అలాంటి వారికి ప్రచారం ఇవ్వడం వల్లే వాళ్ళు పాపులర్ అవుతున్నారు’ అని నాని అన్నారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో బాలీవుడ్ మీడియా నాని ని టార్గెట్ చేసింది.
అర్షద్ వార్సి ఏం తప్పు చేశాడని మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ప్రభాస్ వంటి బడా స్టార్ అలా కామెడీగా కనపడటం వల్ల అర్షద్ బాధ పడి ఉంటాడు. నాని కూడా ఇలా మాట్లాడటం పద్ధతి కాదు అని బాలీవుడ్ జనాలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో నాని వివరణ ఇచ్చాడు .. అర్షద్ వార్సి చాలా గొప్ప నటుడు. సౌత్ – నార్త్ అని కాదు. దేశం మొత్తం ఆయన్ని ఇష్టపడుతుంది.
నటులుగా ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థమైంది. పదాల ఎంపిక లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేయకపోవడం వల్లే మేమిద్దరం(అర్షద్ వార్సి, నాని) బాధితులమయ్యాం. ప్రభాస్ గురించి ఆయన చేసిన కామెంట్స్ నేను విన్నా. మనం ఇష్టపడే వారి గురించి ఇలాంటి ప్రస్తావన వస్తే .. అనవసరమైన విషయానికి మనం ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇవ్వాలి అని సహజంగా అంటాం. నేను కూడా అదే విధంగా అన్నాను.
కానీ నా మాటలు వైరల్ అవ్వడం. వాటికి వచ్చిన రియాక్షన్స్ చూసిన తర్వాత అర్షద్ ఫుల్ ఇంటర్వ్యూ చూశా. మీడియా, సోషల్ మీడియా తప్పుదోవ పట్టించింది అని అర్థమైంది. అదే విధంగా నా వ్యాఖ్యలు కూడా ప్రజల్లోకి వేరే విధంగా వెళ్లాయి అని నాని వివరణ ఇచ్చారు. అర్షద్ వార్సి విషయంలో నాని నోరు జారీ నాలుక కరుచుకోవాల్సి వచ్చింది.
Web Title: Actor nani expressed regret over bollywood actor arshad warsi comments about prabhas
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com