HomeNewsMahesh Babu: మహేష్ బాబు కి తమిళ డైరెక్టర్లంటే అందుకే నచ్చదు...

Mahesh Babu: మహేష్ బాబు కి తమిళ డైరెక్టర్లంటే అందుకే నచ్చదు…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…ఈయన చాలా తక్కువ సమయంలోనే టాప్ హీరోగా మారిపోయాడు. నటన పరంగా సత్తా చాటుకన్నాడు. అలాగే ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులందరిని మెప్పించాయి. ముఖ్యంగా ఘట్టమనేని ఫ్యామిలీ అభిమానులందరు అతని సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఒక్కడు సినిమాతో టాప్ హీరోగా మారిపోయిన ఆయన ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎక్కడ నిరాశపరచలేదు. ఇక ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో సైతం మరోసారి ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు.

కాబట్టి వారణాసి సినిమా కోసం ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమానైతే చేస్తున్నారట. మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన సక్సెస్ లు అతన్ని సినిమా ఇండస్ట్రీలో టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. మరి వారణాసి సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. కారణం ఏంటి అంటే గతంలో మహేష్ బాబుకి తమిళ్ డైరెక్టర్లు పెద్ద షాక్కులైతే ఇచ్చారు. అందుకే వాళ్ళతో సినిమాలు చేయడానికి ఆయన పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే తమిళ్ డైరెక్టర్లంటే తనకు నచ్చడం లేదనే విషయాన్ని సైతం తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట.

మహేష్ బాబు కెరియర్ స్టార్టింగ్ లో ఎస్ జె సూర్యతో చేసిన నాని సినిమా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది. ఆ తర్వాత ఏరి కోరి మరి మురుగదాస్ తో ‘స్పైడర్’ అనే సినిమా చేశాడు. సినిమా డిజాస్టర్ గా మారడంతో మహేష్ బాబు మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. కాబట్టి తమిళ్ డైరెక్టర్లను నమ్మడం మానేశాడు. ప్రస్తుతం మహేష్ బాబు తెలుగు డైరెక్టర్లతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular