Homeజాతీయం - అంతర్జాతీయంUS Iran ceasefire India reaction: అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ: భారత్ కీలక నిర్ణయం.....

US Iran ceasefire India reaction: అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ: భారత్ కీలక నిర్ణయం.. పాక్ పని అయిపోయినట్టే

US Iran ceasefire India reaction: ఊహించినట్టుగానే అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు వారాలపాటు ఇది అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే హర్ముజ్ జల సంధిని తెరుస్తామని ఇరాన్ ప్రకటించింది.. తమ పహారా మధ్య సరుకు రవాణా జరుగుతుందని ప్రకటించింది.. కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో పాకిస్తాన్ కీలకపాత్ర పోషించినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిని పాకిస్తాన్ ప్రధానమంత్రి.. ఆ దేశ సర్వ సైన్యాధ్యక్షుడు గొప్పగా చెప్పుకుంటున్నారు. పాకిస్తాన్ చేసుకుంటున్న ప్రచారంపై అంతర్జాతీయ మీడియాలో మరొక విధమైన వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ కు గతి లేదు కాబట్టి.. గత్యంతరం లేక కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తి పాత్ర పోషించిందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.

భారత్ కీలక నిర్ణయం

కాల్పుల విరమణ ఒప్పందం కుదరగానే భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ ఏప్రిల్ 9న యూఏఈ లో పర్యటిస్తారు. ఏప్రిల్ 9న హిందూ ఓసియన్ సదస్సులో ఆయన పాల్గొంటారు. ఇది మారిషస్ ప్రాంతంలో జరుగుతుంది. ఈ పర్యటనలో భాగంగా మారిషస్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి తో ఆయన సమావేశం అవుతారు. రెండు దేశాల మధ్య వ్యాపార విషయాలకు సంబంధించి కీలకంగా చర్చిస్తారు.

ఈ సదస్సులో జై శంకర్ కీలక ఉపన్యాసం చేస్తారు.. ఈ పర్యటన భారత్ అనుసరిస్తున్న “నైబర్ హుడ్ ఫస్ట్”, విజన్ మహాసాగర్, గ్లోబల్ సౌత్ విధానాలను బలంగా నొక్కి చెబుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఈ పర్యటన రెండవ దశలో భాగంగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ ఏప్రిల్ 11, 12 తేదీలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అధికారిక పర్యటనలో పాల్గొంటారు.. రెండు దేశర మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం.. ఎగుమతులు.. వాణిజ్యం.. ఇచ్చిపుచ్చుకునే ధరణిపై చర్చలు జరుగుతాయి.

ఇటీవల యూఏఈ తాను ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించాలని పాకిస్తాన్ కు సూచించింది. మొత్తం 36వేల కోట్లకు పైగా అప్పును పాకిస్తాన్ చెల్లించాల్సి ఉంది. విదేశీ మారక ద్రవ్య నిల్వల నుంచి అప్పు చెల్లించాలని పాక్ నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం పాకిస్తాన్ ఆ పనిలో పడింది.. శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అన్నట్టుగా భారత్ యూఏఈ తో ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఇది పాకిస్తాన్ దేశానికి తీవ్రమైన శరాఘాతంలాగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ దేశాన్ని గల్ఫ్ దేశాలు నమ్మే పరిస్థితి లేదని.. ఇప్పుడు యూఏఈ కూడా నమ్మడం లేదని.. భవిష్యత్ కాలంలో పాకిస్తాన్ దేశానికి మొత్తం కష్టాలేనని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular