Homeఅంతర్జాతీయంPakistan Army Chief Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ లేపేయడానికి ఇజ్రాయిల్ స్కెచ్.. నవ్వి...

Pakistan Army Chief Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ లేపేయడానికి ఇజ్రాయిల్ స్కెచ్.. నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవడ్రా గ్యారెంటీ..

Pakistan Army Chief Munir: ఏదైనా ఒక విషయం చెబితే నమ్మే విధంగా ఉండాలి. ముఖం మీద ఉమ్మే విధంగా ఉండకూడదు. ఈ విషయం కూడా అటువంటిదే. దానిని ఒక బ్రెజిల్ జర్నలిస్ట్ చెప్పాడు. జర్నలిస్టు కదా.. చెబితే నమ్మాలి కదా అనుకుంటుంటే.. అది నమ్మే విధంగా లేదు. ముఖం మీద ఉమ్మే విధంగా ఉంది. ఇంతకీ అతడు చెప్పిన ఆ కథేంటి.. దాని వ్యవహారం ఏంటి.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా మునిర్ కొనసాగుతున్న విషయం […]

Pakistan Army Chief Munir: ఏదైనా ఒక విషయం చెబితే నమ్మే విధంగా ఉండాలి. ముఖం మీద ఉమ్మే విధంగా ఉండకూడదు. ఈ విషయం కూడా అటువంటిదే. దానిని ఒక బ్రెజిల్ జర్నలిస్ట్ చెప్పాడు. జర్నలిస్టు కదా.. చెబితే నమ్మాలి కదా అనుకుంటుంటే.. అది నమ్మే విధంగా లేదు. ముఖం మీద ఉమ్మే విధంగా ఉంది. ఇంతకీ అతడు చెప్పిన ఆ కథేంటి.. దాని వ్యవహారం ఏంటి..

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా మునిర్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇతగాడు తన పదవిని కాపాడుకోవడం కోసం రకరకాల మాయలు.. రకరకాల వ్యవహారాలు సాగిస్తూ ఉంటాడు. అమెరికా ముందు సాగిలపడుతూ ఉంటాడు. అదే కాదు తన పదవి కోసం పాకిస్తాన్ ప్రయోజనాలను సైతం తాకట్టు పెట్టడానికి వెనుకాడడు. అటువంటి మునీర్ ఇజ్రాయిల్ లిస్టులో ఉన్నాడట. ఇజ్రాయిల్ సీక్రెట్ ఏజెన్సీ సంస్థ మోసాద్ ఇతడిని లేపేయడానికి కుట్ర పన్నిందట. అంతేకాదు కొంతకాలంగా పాకిస్తాన్ డెలిగేట్స్ విషయంలో కూడా ఇజ్రాయిల్ పక్క ప్లాన్ తో ఉందట.

ఈ విషయాన్ని బ్రెజిల్ జర్నలిస్టు పేప్ ఎస్కో బార్ బయటపెట్టాడు. జెనీవాలో అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చ సందర్భంగా మునీర్.. ఇతర పాకిస్తాన్ డెలిగేట్స్ ను చంపడానికి ఇజ్రాయిల్ స్కెచ్ వేసిందట.. ఈ విషయం పాకిస్తాన్ దేశానికి తెలిసిందంట. మా ఆర్మీకి ఏదైనా జరిగితే మీ దేశాన్ని నాశనం చేస్తామని మధ్యవర్తుల ద్వారా పాకిస్తాన్ హెచ్చరించిందట.

పాకిస్తాన్ కే దిక్కు దివానం లేదు. లెబనాన్ మీద దాడులు చేస్తుంటే అంతటి అమెరికా మూసుకొని కూర్చుంది. పైగా ఇజ్రాయిల్ సీక్రెట్ ఏజెన్సీ సంస్థ ఎలా పనిచేస్తుందో అందరికీ తెలుసు. చివరికి అమెరికా కూడా ఇజ్రాయిల్ ముందు తలవంచక తప్పదు. ఇజ్రాయిల్ స్కెచ్ వేస్తే ఎంతటి నాయకుడైనా సరే చావాల్సిందే. అంతటి కోరలు చాచి ఉన్న ఇరాన్ ఖమేని చచ్చి ఊరుకున్నాడు. అటువంటి ఇజ్రాయిల్ సీక్రెట్ ఏజెన్సీ ముందు పాకిస్తాన్ నిలబడుతుందా.. మునీర్ బతికి బట్ట కడతాడా..

ఒకవేళ ఇజ్రాయిల్ దేశానికి పాకిస్తాన్ పై దాడులు చేయాల్సిన అవసరం ఏంటి.. మునీర్ ను చంపేస్తే పాకిస్తాన్ కి వచ్చే ప్రయోజనం ఏంటి. ఇవేవీ పనికొచ్చే ముచ్చట్లు కావు. బ్రెజిల్ జర్నలిస్ట్ ఏదో గాలి మాటలు మాట్లాడినట్టు కనిపిస్తోంది. ఒకవేళ చంపాలి అనుకుంటే ఇజ్రాయిల్ దేశానికి పెద్ద లెక్క కాదు. పాకిస్తాన్ దేశం పెద్ద లెక్కలోది కాదు. ఎందుకంటే ఇజ్రాయిల్ సాంకేతికంగా.. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశం. అక్కడ ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. పాకిస్తాన్ లాగా దరిద్రంగా.. చండాలంగా ఉండదు.

ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇజ్రాయిల్ మీద దాడి చేస్తే.. మరుసటి క్షణం ఈ భూమి మీద పాకిస్తాన్ పేరు ఉండదు. ఇజ్రాయిల్ తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇరాన్ కు తెలుసు.. హిజ్ బుల్లా ఉగ్రవాదులకు తెలుసు. తెలియనిది కేవలం పాకిస్తాన్ కి మాత్రమే. ఆల్రెడీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దెబ్బకు పాకిస్తాన్ అన్ని మూసుకుంది. ఆ చిన్న దళాన్నే పాకిస్తాన్ ఏం చేయలేకపోతోంది. ఇజ్రాయిల్ దేశాన్ని ఏం చేయగలుగుతుంది..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper