Homeజాతీయంఅప్పుల్లో కేంద్రం.. ఇక ప్రజలకు ప్యాకేజీలు లేవట?

అప్పుల్లో కేంద్రం.. ఇక ప్రజలకు ప్యాకేజీలు లేవట?

central debtsకరోనా మహమ్మారితో ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. మన భారత ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది. ఏకంగా మైనస్ లలోకి చేరాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 9 శాతం ప్రతికూలత నమోదు చేస్తుందని గ్లోబల్ రేటింగ్ ఎస్ అంద్ పీ అంచనావేసింది.

Also Read: మీ ఆస్తులు ఇక భద్రం: ఓనర్‌‌ లేకున్నా ఇంటికొచ్చి నమోదు చేస్తారు

ప్రభుత్వానికి కరోనాతో ఆదాయం పడిపోయిన నేపథ్యంలో రుణ లక్ష్యం రూ.12 లక్షల కోట్లకు కట్టుబడి ఉన్నట్టు చెబుతున్నారు. రుణాల్లో మార్పు లేదని ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతానికి కేంద్రం భారీ ఉద్దీపనకు ముందుకు వెళ్లకపోవచ్చని భావిస్తున్నారు.

బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం ఆగస్టు చివరి నాటికి కేంద్ర ఆర్థిక ద్రవ్యలోటు రూ.8.7 లక్షల కోట్లుగా ఉంది. పూర్తి ఏడాదికి బడ్జెట్ లో అందించిన రూ.7.96 లక్షల కోట్ల కంటే 9.3శాతం ఎక్కువ. అయితే ద్రవ్యలోటు రూ.14 లక్షల కోట్ల నుంచి రూ.18 లక్షల కోట్ల మధ్య ఉండవచ్చునని నిపుణుల అంచనా.

ఇప్పటికే కేంద్రం సెప్టెంబర్ తో ముగిసిన ప్రథమార్థంలో రూ.7.66 లక్షల కోట్ల రుణం తీసుకుంది. ఈ ఏడాది రూ.12 లక్షల కోట్ల రునాలు తీసుకుంటామని మే నెలలో ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కారణంగా దీనిని 50శాతం పెంచి రూ.12 లక్షల కోట్లకు పెంచవలసిన పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) ద్వితీయార్థంలో కేంద్ర ప్రభుత్వం రూ.4.34 లక్షల కోట్ల అప్పులు చేయనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12 లక్షల కోట్ల రుణ లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు.

Also Read: బాబును మించిపోయిన జగన్.. అప్పుల్లో ఏపీ సరికొత్త రికార్డు

కరోనా కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. దీంతో కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు కూడా అప్పులు చేయక తప్పడం లేదు. ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా లక్షల కోట్లు అప్పులు చేస్తున్నట్టు తాజాగా ఆర్థిక శాఖ తెలుపడంతో ఇక భవిష్యత్తులో పరిశ్రమలకు, ప్రజలకు ప్యాకేజీలు ఇవ్వడం కుదరదని తేలిపోయింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Oktelugu Epaper