
తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖ నిర్మాత నట్టి కుమార్‌పై మరో నిర్మాత చంటి అడ్డాల కేసు నమోదు చేశారు. ‘ఐనా ఇష్టం నువ్వు’ అనే సినిమా తన దగ్గర కొంటానని డబ్బులు ఇవ్వలేదని చెప్పాడు. చెక్కులు ఇచ్చి ఇప్పుడే ప్రొసీడ్ అవ్వొద్దని దీంతో ఆయనపై మొదట ఫిల్మ్‌ఛాంబర్‌లో ఫిర్యాదు చేశానన్నారు. అయితే ఫిల్మ్‌ఛాంబర్ మా మధ్య చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసిందని అయినా కూడా నా పేరు తీసేసి తన పేరు వేసుకున్నాడని చంటి పేర్కొన్నారు. దీంతో అతనిపై యాక్షన్ తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని దీంతో కేసు నమోదైందన్నారు.
Also Read: థియేటర్ల ఓపెనింగ్.. కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందా?