Homeజాతీయ వార్తలుGyanesh Kumar: సుప్రీం కోర్టు చివాట్లు పెట్టింది.. పాపం రాహుల్ గాంధీ..ఇక కష్టమే..

Gyanesh Kumar: సుప్రీం కోర్టు చివాట్లు పెట్టింది.. పాపం రాహుల్ గాంధీ..ఇక కష్టమే..

Gyanesh Kumar: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత.. పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. సుప్రీంకోర్టు వరకు ప్రతిపక్ష నేతలు నిర్వహించిన నిరసన మార్చ్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరని స్పష్టం చేశారు. కోర్టు బయట ఏం మాట్లాడుతున్నారు.. లోపలికి వచ్చిన తర్వాత ఏం చెబుతున్నారు అనే విషయాలు మాకు తెలుసని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారానికి సంబంధించి పార్లమెంట్ […]

Gyanesh Kumar: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత.. పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. సుప్రీంకోర్టు వరకు ప్రతిపక్ష నేతలు నిర్వహించిన నిరసన మార్చ్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరని స్పష్టం చేశారు. కోర్టు బయట ఏం మాట్లాడుతున్నారు.. లోపలికి వచ్చిన తర్వాత ఏం చెబుతున్నారు అనే విషయాలు మాకు తెలుసని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారానికి సంబంధించి పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడితో సహా పలువురు నాయకులకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఇది కాస్త రాజకీయంగా చర్చనీయాశంగా మారింది..

అసలు వివాదం ఏంటి

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం తీరును ప్రశ్నిస్తూ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 12న ఢిల్లీలో ప్రతిపక్ష నేతలు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహించారు. ఈ నిరసనలు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి సంబంధించిన పలురు నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేయడమే ఈ నిరసన ప్రధాన ఉద్దేశం. అయితే, న్యాస్థానం ప్రాంగణం సమీపంలో రాజకీయ నిరసనలు నిర్వహించడం.. వాటి వల్ల ఏర్పడే పరిణామాలపై ఇప్పుడు న్యాయపరమైన చర్చ మొదలైంది.

ఎవరూ బెదిరించలేరు

సుప్రీంకోర్టులో గురువారం ఈ వ్యవహారానికి సంబంధించిన పిటిషన్లపై విచారణ మొదలైంది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాన్ని ఎవరూ భయపెట్టలేరని.. బెదిరింపులతో న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తీసుకురావడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. కోర్టు బయట ఒక విధంగా మాట్లాడి.. న్యాయస్థానంలోకి వచ్చిన తర్వాత మరొక విధంగా వ్యవహరించి అంశాలు తమ దృష్టికి వస్తున్నాయని పేర్కొన్నారు. తాము వాస్తవాలకు దూరంగా లేమని.. బయట జరుగుతున్న పరిణామాలపై కూడా తమకు అవగాహన ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

రాహుల్ గాంధీతో సహా పలువురికి నోటీసులు

సుప్రీంకోర్టు ప్రాంగణం.. దాని పరిసర ప్రాంతాల్లో రాజకీయ నిరసనలను నియంత్రించేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు నోటీసులు జారీ చేసింది. నిరసనలకు పిలుపునిచ్చిన నాయకుల బాధ్యతలను నిర్ణయించాలని కూడా ఆ పిటిషన్ లో కోరారు. ఈ వ్యవహారంలో రాహుల్ గాంధీ తో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు మల్లికార్జున కార్గే.. అఖిలేష్ యాదవ్.. ఇతర నాయకుల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. నిరసన సందర్భంగా జరిగిన పరిణామాలకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలను భద్రపరచాలని కూడా కోర్టు ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఇక ఇదే సమయంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన ప్రతిపక్ష నాయకులు దాఖలు చేసిన పిటిషన్లు కూడా విచారణకు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఒకవైపు ఎన్నికల జాబితాలపై ప్రతిపక్షాల అభ్యంతరాలు, మరోవైపు సుప్రీంకోర్టు వరకు నిర్వహించిన నిరసనపై న్యాయపరమైన ప్రశ్నలు చర్చకు వస్తున్నాయి.

తదుపరి జరిగే పరిణామాలు ఏంటి

సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.. నోటీసుల నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే తుది తీర్పు వెలువడే వరకు అన్ని పక్షాల వాదనలను పరిగణలోకి తీసుకుంటామని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పేసింది. ఎన్నికల జాబితాలపై ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు ఎన్నికల సంఘం ఇచ్చే సమాధానాలతో పాటు, కోర్టు ప్రాంగణం వద్ద నిరసనలకు సంబంధించిన పిటిషన్ లపై సుప్రీంకోర్టు తీసుకునే తదుపరి నిర్ణయాలు అత్యంత కీలకంగా మారబోతున్నాయి.

మొత్తానికి ఓటర్ల జాబితాల వివాదంతో మొదలైన రాజకీయ పోరు ఇప్పుడు న్యాయస్థానం ప్రాంగణంలో నిరసనల నిర్వహణ, న్యాయవ్యవస్థ స్వతంత్రత వంటి అంశాల చుట్టూ తిరుగుతోంది. ఈ కేసులో తదుపరి విచారణలో ఎలాంటి మలుపులు తీసుకుంటాయో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper