Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Mohan Reddy: ఎర్ర బస్సు.. స్పెషల్ ఫ్లైట్..జగన్ కు ఇచ్చి పడేస్తున్నారుగా..

YS Jagan Mohan Reddy: ఎర్ర బస్సు.. స్పెషల్ ఫ్లైట్..జగన్ కు ఇచ్చి పడేస్తున్నారుగా..

YS Jagan Mohan Reddy: భోగాపురానికి ఎర్ర బస్సు కూడా రాదు.. అటువంటి ప్రాంతానికి విమానం ఎందుకని గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్ అనేక సందర్భాలలో విమర్శలు చేశారు. భోగాపురంలో విమానాశ్రయం ఏర్పాటును వ్యతిరేకించాలని ప్రజల్లో లేని ఆలోచన తీసుకొచ్చారు. భోగాపురం విమానాశ్రయానికి వ్యతిరేకంగా అప్పట్లో పార్టీ తరఫున ఒక కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇవేవో ఆరోపణలు కాదు. విమర్శలు అంతకంటే కాదు. ఆన్ రికార్డెడ్ వాస్తవాలు. ఈ ప్రాంతంలో నిర్మిస్తున్న విమానాశ్రయం మీద ఎన్ని […]

YS Jagan Mohan Reddy: భోగాపురానికి ఎర్ర బస్సు కూడా రాదు.. అటువంటి ప్రాంతానికి విమానం ఎందుకని గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్ అనేక సందర్భాలలో విమర్శలు చేశారు. భోగాపురంలో విమానాశ్రయం ఏర్పాటును వ్యతిరేకించాలని ప్రజల్లో లేని ఆలోచన తీసుకొచ్చారు. భోగాపురం విమానాశ్రయానికి వ్యతిరేకంగా అప్పట్లో పార్టీ తరఫున ఒక కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇవేవో ఆరోపణలు కాదు. విమర్శలు అంతకంటే కాదు. ఆన్ రికార్డెడ్ వాస్తవాలు.

ఈ ప్రాంతంలో నిర్మిస్తున్న విమానాశ్రయం మీద ఎన్ని రకాలుగా విమర్శలు చేసినప్పటికీ.. అడ్డుకోవడానికి కుట్రలు చేసినప్పటికీ చంద్రబాబు ముందుచూపుతో విమానాశ్రయం పూర్తి చేశారు. కేంద్రం సహకారంతో అంతర్జాతీయ స్థాయిలో దానిని నిర్మించారు. భోగాపురం విమానాశ్రయాన్ని ఇటీవల ప్రధానమంత్రి ప్రారంభించారు. ఆ ప్రాంతంలో ప్రస్తుతం విమానాల రాకపోకలు మొదలయ్యాయి. భోగాపురం ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేసే స్థాయికి ఎదిగింది. ఒకరకంగా ఇప్పుడు ఉత్తరాంధ్ర అంటే కేరాఫ్ భోగాపురం అనే స్థాయికి ఎదగబోతోంది.

ఒకప్పుడు భోగాపురం ప్రాంతంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తుంటే హేళన చేసిన జగన్.. ఇప్పుడు అదే అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో దిగడం చర్చకు కారణం అవుతుంది. నాడు ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే.. కోవడానికి అనేక రకాలుగా కుట్రలు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించడంతో.. కేవలం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలంలోనే విమానాశ్రయాన్ని పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చింది. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పూర్తి కావడంతో ఉత్తరాంధ్ర ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. రోడ్ల నిర్మాణం కూడా శరవేగంగా సాగిపోతోంది.

జగన్ తీరు పట్ల ఇప్పటికే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు వైసిపి అధినేతగా ఉన్న జగన్ భోగాపురం విమానాశ్రయాన్ని ఎంతగానో ఎద్దేవా చేశారని.. కానీ నేడు అదే విమానాశ్రయంలోకి ప్రత్యేకమైన విమానంలో రావడం ఆయన రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనమని ఎత్తిపొడిచారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను కాలరాసే విధంగా మాట్లాడినందుకు జగన్ ప్రజలకు బే షరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.. భోగాపురంలో ప్రత్యేకమైన విమానంలో దిగిన తర్వాత జగన్ నోటి వెంట మాట రాలేదు. ఎందుకంటే అక్కడ చేసిన అభివృద్ధి.. విమానాశ్రయం నిర్మించిన తీరు ఆస్థాయిలో ఉంది. ఇప్పటికైనా అభివృద్ధిని అడ్డుకోవడం కాకుండా.. స్వాగతించే కోణంలో జగన్ వ్యవహరించాలని కూటమి నాయకులు సూచిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper