Karnataka CM: దేశవ్యాప్తంగా నాలుగు ప్రధాన రాష్ట్రాలలో విధాన సభకు ఎన్నికల జరిగాయి. ఈ ఫలితాలు వెలువడ్డాయి. కొద్దిరోజులుగా కేంద్రం తీసుకొచ్చిన SIR విధానంపై ఆరోపణలు చేస్తున్నాయి విపక్షాలు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని రాహుల్ నుంచి మొదలు పెడితే మల్లికార్జున ఖర్గే వరకు డిమాండ్ చేస్తున్నారు. ఒక దశలో మిషన్లు వద్దని, పూర్వ విధానంలో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్లు ఇలా కొనసాగుతుండగానే.. నాలుగు ప్రధాన రాష్ట్రాలలో జరిగిన విధానసభ ఎన్నికల ఫలితాలు కమలం పార్టీకి అనుకూలంగా వచ్చాయి. కమలం పార్టీ ప్రాతినిధ్యం కొనసాగుతున్న ఉత్తర ప్రదేశ్.. మహారాష్ట్ర.. బీహార్.. హస్తం అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రాలలో పెద్దల సభకు పోలింగ్ జరిగింది.
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అదరగొట్టింది. ప్రతిపక్షాలకు ఏమాత్రం కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టింది. ఇక ప్రధాన ప్రతిపక్షం గురించి ఒక ముక్కలో చెప్పాలంటే హస్తం 0 ఫలితాలను సాధించింది.. ఉత్తరప్రదేశ్, బీహార్.. మహారాష్ట్ర లో బిజెపి ఆధ్వర్యంలో అభ్యర్థులు తిరుగులేని లీడ్ సాధించి.. విజయాన్ని అందుకున్నారు.. ఉపాధ్యాయులు.. విద్యావంతులు.. పట్టభద్రులు తమ ఓటు హక్కును ఉపయోగించుకొని.. బిజెపికి జై కొట్టారు. ఈ పరిణామం కాంగ్రెస్ క్యాడర్ మొత్తాన్ని నిరాశలో ముంచింది.
ఇండియా కూటమి.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఏదైనా ఓటములను సైడ్ ట్రాక్ పట్టించేందుకు ట్యాంపరింగ్ అనే ఆరోపణలను చేస్తున్నాయి. బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ జరిగినప్పటికీ కాంగ్రెస్ గెలవలేదు. మరో వైపు కన్నడ గడ్డలో నాలుగు స్థానాలకు పోటీ జరిగింది. ఇందులో కూడా హస్తం సున్నా ఫలితాలు సాధించింది. ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఒక్క సీటు కూడా దక్కించుకోకపోవడంతో సీఎం డీకే శివకుమార్ పై బీజేపీ రెచ్చిపోతోంది.ఇట్స్ డన్ బ్రో అంటూ శివకుమార్ చెవిలో పూలు పెట్టి.. ఫొటోలు సర్కులేట్ చేస్తోంది. ఇటీవల ఎన్నికల సంఘం కమిషనర్ పై హస్తం పార్టీ ఇదేస్థాయిలో క్యాంపెయిన్ చేసింది.
ఈ పరాజయం తర్వాత హస్తం పార్టీ నిశ్బబ్దంగా ఉండిపోయింది. ఆ పార్టీ అదే పనిగా గొంతు చించుకుంటున్న సర్ ప్రక్రియ పై ఉద్యమం చేస్తుందా.. సీఈసీ మీద వార్ ను కొనసాగిస్తుందా.. అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సిన అనివార్యత ఇప్పుడు ఉంది. ఈ ఫలితాలు బీజేపీలో తిరుగులేని ఉత్సాహాన్ని నింపాయి. ఆ పార్టీ నాయకులు హస్తం నాయకులను సోషల్ మీడియాలో చెడుగుడు ఆడుకుంటున్నారు. ఏమోయ్ కాంగ్రెస్ యువరాజా.. చూశావా మా తడాఖా అంటూ రెచ్చిపోతున్నారు.
DK, it’s done, bro!
NDA SWEEPS 4/4 Teachers’ and Graduates’ constituencies in the MLC elections! ✌️ https://t.co/RD8lDwpE3e
— BJP Karnataka (@BJP4Karnataka) October 28, 2026