Homeక్రైమ్‌Kanyakumari News: అతనికి 31.. ఆమెకు 26.. ఉదయం పెళ్లి.. సాయంత్రానికి ఏం చేశారో తెలుసా..

Kanyakumari News: అతనికి 31.. ఆమెకు 26.. ఉదయం పెళ్లి.. సాయంత్రానికి ఏం చేశారో తెలుసా..

Kanyakumari News: ఓ యువతీ యువకుడు ప్రేమించుకుంటారు. ప్రేమలో ఉన్నంతవరకు సరదాగా తిరుగుతారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. పెద్దలను ఒప్పిస్తారు. అనేకరకాల ఇబ్బందులు పడి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరికీ అభిప్రాయ బేధాలు వస్తుంటాయి. పెళ్లి జరిగిన తర్వాత ఇగోలు పెరుగుతాయి. ఒకరి మీద మరొకరి పెత్తనాన్ని సహించలేరు. దీంతో విడాకులు తీసుకుంటారు. చదువుతుంటే ఎన్నో తెలుగు సినిమాలు మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా.. కానీ ఇటువంటిది రియల్ లైఫ్ లో జరుగుతే.. […]

Kanyakumari News: ఓ యువతీ యువకుడు ప్రేమించుకుంటారు. ప్రేమలో ఉన్నంతవరకు సరదాగా తిరుగుతారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. పెద్దలను ఒప్పిస్తారు. అనేకరకాల ఇబ్బందులు పడి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరికీ అభిప్రాయ బేధాలు వస్తుంటాయి. పెళ్లి జరిగిన తర్వాత ఇగోలు పెరుగుతాయి. ఒకరి మీద మరొకరి పెత్తనాన్ని సహించలేరు. దీంతో విడాకులు తీసుకుంటారు. చదువుతుంటే ఎన్నో తెలుగు సినిమాలు మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా.. కానీ ఇటువంటిది రియల్ లైఫ్ లో జరుగుతే.. అది కూడా ఉదయం మొదలై సాయంత్రానికి ముగిసిపోతే.. ఇదేంటి ఇలా ఎలా సాధ్యం అనుకుంటున్నారా.. దాన్ని సాధ్యం చేసింది ఈ జంట..

అది తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా కులచ్చల్ ప్రాంతం. ఈ ప్రాంతంలో 31 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి సైనికుడిగా పని చేస్తున్నాడు. ఇతడు కన్యాకుమారి, కేరళ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన పారసాలై ప్రాంతానికి చెందిన 26 యువతితో గడిచిన నాలుగు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాడు. ఆ యువతి తిరువనంతపురంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో ఫార్మసీ విభాగంలో పనిచేస్తోంది. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నవారు.. తమ ప్రేమను మరో స్థాయికి తీసుకెళ్లాలి అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే తమ ప్రేమ వ్యవహారాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. అనేక రకాలుగా ఆలోచించి పెద్దలు వారిద్దరి పెళ్ళికి ఒప్పుకున్నారు…

సరిగ్గా ఆరోజు రానే వచ్చింది.. గత సోమవారం వారిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం పూట వివాహం జరిగింది. వివాహానికి రెండు కుటుంబాలకు సంబంధించిన బంధువులు భారీగా వచ్చారు. విందు భోజనాలు కూడా బ్రహ్మాండంగా పెట్టారు. సాయంత్రం పూట వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అక్కడిదాకా అంతా బాగానే జరిగింది. ఆ తర్వాత వరుడి ఫ్రెండ్స్ రావడంతో అతడు కాస్త మద్యం తాగాల్సి వచ్చింది. ఆ మద్యం కూడా అధిక మోతాదులో తీసుకున్నాడు. మత్తులో మునిగిపోయాడు. ఈ విషయం వధువు తండ్రికి తెలిసింది. ఇలా తాగడం కరెక్ట్ కాదు అంటూ అతడికి హితబోధ చేశాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వరుడికి వధువు తండ్రి చెప్పే మాటలు వేరే విధంగా అనిపించాయి. అతడికి పట్టరాని కోపం వచ్చింది. ఆ కోపంలో వధువు తండ్రితో విపరీతంగా గొడవపడ్డాడు. అంతేకాదు అడ్డువచ్చిన భార్యపై కూడా చేయి చేసుకున్నాడు. ఈ వ్యవహారం జరిగిన తర్వాత వధువు.. ఆమె తండ్రి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో కూర్చొని మాట్లాడుకున్నాయి. ప్రారంభంలోనే తన భర్త ఈ స్థాయిలో తాగి.. తనను ఇంత ఇబ్బంది పెడుతుంటే తట్టుకోలేనని.. అతడు తనకు సరైన జోడి కాదని ఆ వధువు భావించింది. పోలీసుల ముందే అతడు కట్టిన మాంగల్యాన్ని తెంపేసింది. భర్తతో తెగ తెంపులు చేసుకొని.. తండ్రితో కలిసి వెళ్లిపోయింది.

నేటి కాలం యువత ఇండిపెండెంట్గా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దానిని ఇష్టపడుతున్నారు. కాబోయే భర్త లేదా భార్య విషయంలో అన్ని రకాలుగా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్నారు. తమ అంచనాలు తగ్గట్టుగా ఉండకపోతే మరో మాటకు తావు లేకుండా ఆ బంధాన్ని తెంపేసుకుంటున్నారు. ఎందుకంటే నేటి కాలంలో ఆర్థిక స్వాతంత్రం అధికంగా ఉంది. ఆడ, మగ అని సంబంధం లేకుండా అందరు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి.. ఎక్కువగా ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్ కోరుకుంటున్నారు. ఇలాంటి ధోరణిలో ఉన్న యువతపై భర్త లేదా భార్య అజమాయిసి చేస్తారంటే ఎవరూ ఒప్పుకోరు. ఈ యువతీ విషయంలో కూడా అలానే జరిగింది.. తన భర్త తాగుబోతు అని తెలిపిన తర్వాత ఆమె మరో మాటకు తావులేకుండా తెగ తెంపులు చేసుకుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper