HomeజాతీయంTeacher Posts : ఏకంగా లక్షా 78 వేల టీచర్ పోస్టులు.. ఏ రాష్ట్రం వారైనా...

Teacher Posts : ఏకంగా లక్షా 78 వేల టీచర్ పోస్టులు.. ఏ రాష్ట్రం వారైనా అర్హులే

జూలై 12లో దరఖాస్తు గడువు ఉంది. ఆగస్టు 24 నుంచి 27 వరకూ ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఈ అవకాశాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని బిహార్ రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. 

Teacher Posts : ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు బిహార్ సర్కారు శుభవార్త చెప్పింది. ఆ రాష్ట్రంలో భారీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు దరఖాస్తు ప్రక్రియను సైతం ప్రారంభించారు. మొత్తం లక్షా 78 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏ రాష్ట్రం వారైనా దరఖాస్తు చేసుకునే వెసులబాటు కల్పిస్తూ మంగళవారం కేబినెట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.గతంలో ఆ రాష్ట్రం అభ్యర్థులతోనే ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చేపట్టేవారు. కానీ తొలిసారిగా ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు అవకాశ: కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలో లక్షా 78 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు. బిహార్ పాలబిక్ కమిషన్ సర్వీసు ద్వారా నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. 85,477 ప్రైమరీ టీచర్లు, 1745 మాధ్యమిక టీచర్లు, 90,804 హైస్కూల్ టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. 1నుంచి 5వ తరగతి టీచర్లకు 18 ఏళ్ళు, 9 నుంచి 10, 11 నుంచి 12 తరగతులకు చెందిన టీచర్లకు 21 ఏళ్లు, అన్ రిజర్వుడ్ పురుషులకు 37ఏళ్లు, అన్ రిజర్వుడ్ మహిళా అభ్యర్థులకు 40 ఏళ్లు, బీసీ, ఈబీసీ, ఓబీసీ అభ్యర్థులకు మరో రెండేళ్ల పాటు అదనంగా వయోపరిమితి కల్పించారు.

ప్రాథమిక తరగతుల టీచర్లకు రూ.25 వేలు, సెకెండరీ గ్రేడ్ టీచర్లకు రూ.31వేలు, ఉన్నత పాఠశాలలకు చెందిన టీచర్లకు రూ.32 వేల మూల వేతనం అందించనున్నారు. రాత పరీక్ష, మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుంది. జూలై 12లో దరఖాస్తు గడువు ఉంది. ఆగస్టు 24 నుంచి 27 వరకూ ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఈ అవకాశాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని బిహార్ రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper