Bihar: సుదీర్ఘకాలం పాలించే ఏ పార్టీకైనా వ్యతిరేకత అనేది కామన్. వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడం కష్టం. అటువంటిది దేశంలో బిజెపి( Bhartiya Janata Party) నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చింది. కచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం పై వ్యతిరేకత అనేది కామన్. కానీ అదే సమయంలో బిజెపిని వ్యతిరేకించే పార్టీలు బలం పెంచుకోలేకపోతున్నాయి. వాటికి అవకాశం చిక్కడం లేదు. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో హోరాహోరీగా పోరాటం చేశాయి. కానీ విజయం మాత్రం ఎన్డీఏకు దక్కింది. అయితే పోరాటం చేసామన్న ఊరట మాత్రం సొంతం చేసుకుంది ఇండియా కూటమి. అయితే ఒకే ఒక్క విజయం కోసం ఎదురుచూస్తోంది కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఆశలు పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే అక్కడ ఇండియా కూటమి వైపు మొగ్గు కనిపిస్తోంది. సర్వేల్లో సైతం ఇదే స్పష్టం అవుతోంది. బీహార్లో మాత్రం ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా పొలిటికల్ సీన్ మారే అవకాశం ఉంది.
* ఇండియా కూటమిదే పైచేయి..
బీహార్లో ( Bihar) హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ఈ రాష్ట్రానికి సుదీర్ఘకాలంగా నితీష్ కుమార్ పాలిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. సర్వేల్లో సైతం ఇది స్పష్టమవుతోంది. ఈ ఎస్ ఎస్ సర్వే పేరిట ఫలితాలు బయటకు వచ్చాయి. ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 10 దాకా చేసిన ఈ సర్వే ఫలితాలు చూస్తే ఎన్ డి ఏ కు 80 సీట్లు… ఇండియా కూటమికి 140 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 243 సీట్లు ఉండే బీహార్ అసెంబ్లీలో ఇండియా కూటమి ప్రభుత్వం ఈసారి వస్తుందని సర్వే చెబుతోంది. అయితే ఇక్కడ ఇండియా కూటమి గెలిస్తే దాని ప్రభావం ఎన్డీఏ పై ఉంటుంది. అటు తర్వాత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బిజెపి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం కలగక తప్పదు. ఎందుకంటే అక్కడ మూడున్నర దశాబ్దాలుగా బిజెపి అధికారంలో ఉంది. తప్పకుండా వ్యతిరేకత ఉంటుంది.
* వైసీపీకి నష్టం..
అయితే ఏపీకి సంబంధించి ఇండియా కూటమి బలపడితే ఏ పార్టీకి నష్టం అంటే.. తప్పకుండా వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అని సమాధానం వస్తుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో అధికార టిడిపి, జనసేన ఉంది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తటస్థ వైఖరి అనుసరిస్తోంది. మొన్నటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. సహజంగానే అది కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టపడడం లేదు. అయితే వైసీపీలో ఉన్న నేతలంతా కాంగ్రెస్ భావజాలం తోనే ఉన్నారు. ఒకవేళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పుంజుకున్న పరిస్థితులు వస్తే తప్పకుండా వైసీపీ నేతలు ఆలోచన వస్తుంది. వారు జగన్ నాయకత్వం కంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరుకుంటారు. ఎక్కువ మంది నేతలు వెయిట్ చేస్తోంది అందుకే. బీహార్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పుంజుకున్న మరుక్షణం ఏపీలో కాంగ్రెస్లోకి వైసీపీ నేతలు క్యూ కట్టడం ఖాయం. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎట్టి పరిస్థితుల్లో నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండరు. అయితే అది బీహార్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే. అందుకే బీహార్ ఫలితాల కోసం ఏపీ రాజకీయాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.