Homeవింతలు-విశేషాలుBihar: అపహరించారు.. మత్తుమందు ఇచ్చారు. ఇది పెళ్ళా..వామ్మో మగాళ్లకు రక్షణ లేకుండా పోయింది

Bihar: అపహరించారు.. మత్తుమందు ఇచ్చారు. ఇది పెళ్ళా..వామ్మో మగాళ్లకు రక్షణ లేకుండా పోయింది

Bihar: పెళ్లి అనేది ఎవరికైనా జీవితకాలపు మధురానుభూతి. అందుకే గుర్తుండిపోయే విధంగా పెళ్లిళ్లు చేసుకుంటారు. ఎంత ఖర్చయినా కూడా వెనుకాడరు. ఇటీవల కాలంలో పెళ్లిని ఒక ఆడంబరమైన వేడుకలాగా చేసుకునేవారు పెరిగిపోయారు. ఇలా వేడుకలు చేసుకునే వారు పెరిగిపోవడంతో.. అన్ని రకాల సౌలభ్యాలు.. సౌకర్యాలు అందించే మేనేజ్మెంట్ సంస్థలు కూడా ఎక్కువయ్యాయి. ఫలితంగా భారతదేశంలో వివాహ మార్కెట్ లక్షల కోట్లకు చేరుకుంది. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా ఈవెంట్ వ్యవస్థలోకి వచ్చేసాయి. పెళ్లిని అత్యంత గొప్పగా జరిపే […]

Bihar: పెళ్లి అనేది ఎవరికైనా జీవితకాలపు మధురానుభూతి. అందుకే గుర్తుండిపోయే విధంగా పెళ్లిళ్లు చేసుకుంటారు. ఎంత ఖర్చయినా కూడా వెనుకాడరు. ఇటీవల కాలంలో పెళ్లిని ఒక ఆడంబరమైన వేడుకలాగా చేసుకునేవారు పెరిగిపోయారు.

ఇలా వేడుకలు చేసుకునే వారు పెరిగిపోవడంతో.. అన్ని రకాల సౌలభ్యాలు.. సౌకర్యాలు అందించే మేనేజ్మెంట్ సంస్థలు కూడా ఎక్కువయ్యాయి. ఫలితంగా భారతదేశంలో వివాహ మార్కెట్ లక్షల కోట్లకు చేరుకుంది. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా ఈవెంట్ వ్యవస్థలోకి వచ్చేసాయి. పెళ్లిని అత్యంత గొప్పగా జరిపే బాధ్యతను అవి భుజాలకు ఎత్తుకుంటున్నాయి.

పెళ్లిని గొప్ప వేడుకలాగా జరుపుకునే మనదేశంలో ఇతడు మాత్రం.. దారుణమైన స్థితిలో పెళ్లి చేసుకున్నాడు. అతడి దుస్థితి చూసి నెటిజన్లు అయ్యో పాపం అంటూ కామెంట్లు చేస్తున్నారు. బీహార్ లోని సమస్తిపూర్ జిల్లాలో ఓ వ్యక్తికి బలవంతంగా పెళ్లి చేశారు. అతడి పేరు నితీష్. బీహార్ లో ఇటీవల ప్రభుత్వం పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగానికి నితీష్ సిద్ధమవుతున్నాడు. అతడిని అపహరించి.. మత్తుమందు ఇచ్చారు. బలవంతంగా తాళి కట్టించారు. అతడు అపస్మారక స్థితిలో కూర్చున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

ఆ యువకుడు లైబ్రరీకి వెళ్తుండగా.. బలవంతంగా ఎత్తుకెళ్లారు. పెళ్లి చేసిన అనంతరం ఇంట్లో బంధించారు. ఆ తర్వాత అతడికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. అతి కష్టం మీద నితీష్ తనను బంధించిన గది కిటికీలోనుంచి బంధువులకు ఫోన్ చేశాడు. జరిగిన విషయం చెప్పాడు. నితీష్ ను ఇలా బలవంతంగా ఎందుకు తీసుకెళ్లారు? ఎందుకు వివాహం జరిపించారు? అతడినే లక్ష్యంగా చేసుకోవడానికి కారణం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.

బీహార్ రాష్ట్రంలో గతంలో అమ్మాయిలను అపహరించేవారు. బలవంతంగా వారికి వివాహాలు జరిపించేవారు. కొన్ని సందర్భాలలో మత్తుమందు కూడా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆడవాళ్ళ స్థానంలో మగవాళ్ళను అపహరిస్తున్నారు. వారికి మత్తుమందు ఇచ్చి బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. నితీష్ కు ఎదురైన అనుభవం బీహార్ లో పరిస్థితిని తేట తెల్లం చేస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper