spot_img
Homeకరోనా వైరస్జెట్‌ స్పీడ్‌లో కరోనా.. ఒక్కరోజులోనే 93 వేలకు పైగా కేసులు

జెట్‌ స్పీడ్‌లో కరోనా.. ఒక్కరోజులోనే 93 వేలకు పైగా కేసులు

Corona Cases In India
దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మళ్లీ భయపెడుతోంది. పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజురోజుకూ కరోనా జెట్ స్పీడ్‌తో పరుగులు పెడుతోంది. కరోనా బారిన పడి అనేక రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. రోజు గడిచే సరికి వేలల్లో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, పోలింగ్ ప్రక్రియ కరోనా కేసుల పెరుగుదల కారణమవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా లక్షకు చేరువగా కరోనా కేసులు నమోదు కావడం తీవ్రతకు అద్దం పడుతోంది.

దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 93,249 కరోనా కేసులు నమోదయ్యాయి. 513 మంది మరణించారు. రోజువారి కరోనా కేసుల పెరుగుదల వరుసగా మూడోరోజు కూడా కొనసాగుతోంది. రెండురోజులుగా 80 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతూ వచ్చాయి. తాజాగా.. ఆ సంఖ్య 90 వేల మార్క్‌ను దాటింది. ఇదే తీవ్రత మున్ముందు కొనసాగితే.. లక్షకు చేరువ కావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన సుదీర్ఘ కాలం తరువాత 90 వేలను దాటాయి రోజువారీ కొత్త కేసులు.

ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,24,85,509కి చేరుకుంది. ఇందులో 1,16,29,289 మంది డిశ్చార్జ్ కాగా.. 1,64,623 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 6,91,597కు చేరింది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 7,59,79,651 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో నమోదవుతున్న రోజువారీ కరోనా కొత్త కేసుల్లో మహారాష్ట్ర వాటా అధికంగా ఉంటోంది. సగం కేసులు అక్కడే నమోదవుతున్నాయి.

మరోవైపు.. మహారాష్ట్రలో వైరస్‌ మరింత భయపెడుతోంది. శనివారం నాటి బులెటిన్‌ ప్రకారం.. మహారాష్ట్రలో ఒక్కరోజు వ్యవధిలో 49 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే పరిస్థితి కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నెలకొని ఉంది. ఆయా రాష్ట్రాల్లో కరోనా ప్రొటోకాల్స్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. అనేక నగరాల్లో రాత్రివేళ కర్ఫ్యూ కొనసాగుతోంది. వారాంతపు రోజుల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. అయినప్పటికీ- కరోనా వైరస్ వ్యాప్తికి మాత్రం ఎక్కడా అడ్డుకట్ట పడడం లేదు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన అషు రెడ్డి.. వీడియో వైరల్

Sudigali Sudheer : బుల్లితెర పై ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హవా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కొనసాగుతోంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ తో ప్రేక్షకులను అలరించిన...

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Oktelugu Epaper