Corona Cases: భారత్ లో గత 24 గంటల్లో 564 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ చేసుల సంఖ్య 4,866కి చేరింది. తాజాగా 674 మంది కోలుకున్నారు. నిన్న మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీ, కర్ణాటకలో ఇద్దరు చొప్పున మొత్తం ఏడుగురు కరోనాతో మరణించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదైన కొవిడ్ మరణాల సంఖ్య 51కి చేరింది. ఏపీలో నిన్న ఒక్క రోజే 19 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఏపీలో 50, తెలంగాణలో 3 యాక్టివ్ కేసులున్నాయి.