అత్యంత ప్రజాదరణపీఆర్సీ నివేదిక తయారీకి రూ.15కోట్ల వ్యయం..!

పీఆర్సీ నివేదిక తయారీకి రూ.15కోట్ల వ్యయం..!

ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పీఆర్సీ నివేదిక తయారైంది. ఇప్పటికే తయారైన పీఆర్సీ నివేదిక సీఎం కేసీఆర్ వద్దకు చేరినట్లు సమాచారం. దీనిపై ఈనెల 30న కేసీఆర్ ఉద్యోగాల సంఘాలతో భేటి అయి అదేరోజు పీఆర్సీ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read: పోలవరానికి కేంద్రం నుంచి వచ్చిందే కట్నమా?

అయితే పీఆర్సీ నివేదిక తయారీకి ప్రభుత్వం రూ.15కోట్ల వ్యయం చేయడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఏర్పడిన తొలి పీఆర్సీ 2018 మే 18న ఏర్పాటైంది. మూడు నెలల్లోగా నివేదికను సమర్పించాలని ప్రభుత్వం నాడే ఉత్తర్వులను జారీ చేసింది.

ఈ పీఆర్సీకి సారథిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సీఆర్‌ బిస్వాల్‌.. మరో ఇద్దరు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు సి.ఉమామహేశ్వరరావు.. మహ్మద్‌ అలీ రఫత్‌లను సభ్యులుగా నియమించారు. మూడునెలల్లో సమర్పించిన నివేదిక గడువు పెంచుతూ 31నెలలు చేశారు.

డిసెంబర్ 31న పీఆర్సీ గడువు ముగియనుండటంతో ఇప్పటికే నివేదిక తయారు చేశారు. పీఆర్సీ నివేదికను రూపొందించే సమయంలోనే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు.. వనరులు.. రాష్ట్ర ఖజానాపై ఎప్పటికప్పుడు ప్రభావం చూపే అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని ప్రభుత్వం సూచించింది.

Also Read: వినూత్నం.. లంచం ఇచ్చేందుకు బిక్షాటన చేస్తున్న యువరైతు..!

తొలుత మూడు నెలల కాలానికి గడువు విధించినప్పటికీ దానిని ఇప్పటివరకు మూడుసార్లు పొడగించారు. సిబ్బంది ఖర్చులు.. వగైరా లెక్కలు చూస్తే ఇప్పటివరకు ప్రభుత్వం వేతన సంఘం నివేదిక కోసం రూ.15కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.

ఇంత భారీ మొత్తం ఖర్చుచేసి తయారు చేసిన పీఆర్సీ నివేదిక రేపోమాపో రానుండటం ఆసక్తిని రేపుతోంది. ముగ్గురు సభ్యులు తయారుచేసిన పీఆర్సీ నివేదిక ఉద్యోగుల్లో ఏమేరకు సంతృప్తిని నింపుతుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Telangana Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు ఇది గుడ్ న్యూస్

Telangana Govt Employees: తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఎట్టకేలకు ఉద్యోగుల పదోన్నతులకు పచ్చజెండా ఊపింది. ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగులు (Employees) హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు పదోన్నతుల కోసం కళ్లల్లో...

జీతాలు చెల్లించలేని స్థితిలో ఏపీ ప్రభుత్వం?

ఆంధ్రప్రదేశ్ లోని మోడల్ స్కూళ్లలో గెస్ట్ ఉపాధ్యాయుల సమస్యలు కోకొల్లలు. ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోతోంది. వారికి చెల్లించాల్సిన బకాయిలు ప్రభుత్వం చెల్లించడం లేదు. కరోనా విపత్తు కారణంగా లాక్...

Most Popular

Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
ISI Agents In India

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...

Malla Reddy : మల్లారెడ్డి హ్యాండిచ్చాడు.. బీఆర్ఎస్ కారాలు మిరియాలు.. ట్విస్ట్ అదిరింది కదూ

Malla Reddy : మైక్ పట్టుకుంటే చాలు మల్లారెడ్డి కేటీఆర్.. కెసిఆర్.. హరీష్ రావు మీద పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. నూరేళ్లు కాదు వెయ్యిళ్లు బతకాలని కోరుతుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాగు...