Homeఎంటర్టైన్మెంట్ప్రీ వెడ్డింగ్ పార్టీలో మునిగితేలుతున్న సునీత-రామ్ జంట!

ప్రీ వెడ్డింగ్ పార్టీలో మునిగితేలుతున్న సునీత-రామ్ జంట!

Sunitha and Ram Pre-Wedding Party
కొత్తబంధంతో నూతన జీవితం ప్రారంభించిన సింగర్ సునీత చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఒంటరి జీవితానికి స్వస్తి పలుకుతూ మరోమారు దాంపత్య జీవితంలో అడుగిడనున్నారు. సునీత మాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకోనున్నారు. ఇటీవల వీరి నిశ్చితార్ధం కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా జరిగింది. తాను రామ్ వీరపనేనిని వివాహం చేసుకోబోతున్నట్లు అదే రోజు సోషల్ మీడియా ద్వారా సునీత తెలియజేశారు. పిల్లలు మరియు తన భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు… తన ఈ నిర్ణయాన్ని సమర్ధించి సహకరించాలని మిత్రులు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

Also Read: క్రేజీ అంకుల్స్ ట్రైలర్: శ్రీముఖి గ్లామర్.. దారుణమైన డబుల్ మీనింగ్ డైలాగ్స్

కాగా పెళ్లికి కొంత సమయం ఉండగా ప్రీ వెడ్డింగ్ పార్టీల్లో మునిగితేలుతున్నారు ఈ జంట. గత రాత్రి హైదరాబాద్ లోని బోల్డర్ హిల్స్ హోటల్ లో అత్యంత సన్నిహితుల మధ్య ప్రీ వెడ్డింగ్ పార్టీ నిర్వహించారు. ఆకర్షణీయమైన ఇన్విటేషన్ కార్ట్ ప్రచురించి మరీ ఈ వేడుకకు మిత్రులను ఆహ్వానించారు. కొద్దిరోజుల ముందు మరోపార్టీని ఈ జంట జరుపుకున్నారు. ఈ వేడుకలో సింగర్ సునీత ఫ్రెండ్స్ రేణూ దేశాయ్, యాంకర్ సుమ పాల్గొన్నారు. ఆట పాటలతో యువ జంట మాదిరి ఉత్సాహంగా కనిపించారు సునీత మరియు రామ్. గత పార్టీలో హీరో నితిన్ సైతం పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి.

Also Read: రజినీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్

ఇక డిసెంబర్ 27న సునీత వివాహం అంటూ కథనాలు రావడం జరిగింది. ఆ డేట్ వాయిదా పడగా జనవరి 9న సునీత వివాహం జరగడం ఖాయం అంటున్నారు. సంక్రాంతికి ముందే కొత్త సంవత్సరంలో సింగర్ సునీత- రామ్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారని సమాచారం. 17ఏళ్లకే సింగర్ గా చిత్ర పరిశ్రమకు పరిచయమైన సునీత…. 19ఏళ్ల వయసులో కిరణ్ కుమార్ గోపరాజుని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. కొన్నేళ్ల క్రితం చట్టబద్ధంగా విడాకులు తీసుకొని వీరు విడిపోయారు. అప్పటి నుండి పిల్లలతో ఒంటిగా ఉంటున్న సునీత రెండో వివాహంగా రామ్ ని చేసుకొన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular