Homeఅత్యంత ప్రజాదరణఏపీ కేబినెట్ : సీఎం జగన్ వరాలు ఇవీ

ఏపీ కేబినెట్ : సీఎం జగన్ వరాలు ఇవీ

చాలా రోజుల తర్వాత సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. నివర్ తుఫానుతో అతాలకుతలమైన నిర్వాసితులు, రైతులను ఆదుకుంటామని సీఎం జగన్ తెలిపారు. ఈ కేబినెట్ మీటింగ్ లో ప్రజలపై సీఎం జగన్ వరాలు కురిపించారు. సీఎం జగన్ నేతృత్వంలో శుక్రవారం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. 27 అంశాలతో ఈ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. Also Read: అసెంబ్లీ ఫైట్: టీడీపీ మీడియాతో జగన్ ను కొట్టే ప్లాన్? కేబినెట్ మీటింగ్ వివరాలను […]

CM Jagan Nivar

చాలా రోజుల తర్వాత సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. నివర్ తుఫానుతో అతాలకుతలమైన నిర్వాసితులు, రైతులను ఆదుకుంటామని సీఎం జగన్ తెలిపారు. ఈ కేబినెట్ మీటింగ్ లో ప్రజలపై సీఎం జగన్ వరాలు కురిపించారు. సీఎం జగన్ నేతృత్వంలో శుక్రవారం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. 27 అంశాలతో ఈ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు.

Also Read: అసెంబ్లీ ఫైట్: టీడీపీ మీడియాతో జగన్ ను కొట్టే ప్లాన్?

కేబినెట్ మీటింగ్ వివరాలను మంత్రి కన్నబాబు మీడియాకు తెలిపారు. నివర్ తుఫాను బాధితులు, నిరాశ్రయులకు తక్షణ సాయంగా రూ.500 చొప్పున సాయం అందజేయాలని సీఎం జగన్ ఆదేశించారు. శిబిరాల్లో తలదాచుకున్న వారందరినీ ఆదుకోవాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు డిసెంబర్ నెలాఖరుల్లా పరిహారం ఇవ్వాలని సూచించారు.

నివర్ తుఫాను కారణంగా రాష్ట్రంలో 30వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు..1300 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నష్టపోయినట్టుగా సమాచారం ఉందని మంత్రి కన్నబాబు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన తుఫాన్ సహాయ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్టు తెలిపారు.

Also Read: గ్రేటర్‌‌ బరి నుంచి జనసేన అందుకే తప్పుకుందా..?

పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపు వార్తలన్నీ అవాస్తవాలన్నారు. ఒక్క సెంటిమీటర్ కూడా తగ్గించడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ బకాయిలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. 2018 జులై 1 నుంచి ఇవ్వాల్సిన బకాయిలు కూడా చెల్లించాలని నిర్ణయించారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper