Dr Sudhakar: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో చాలా రకాల ఘటనలు జరిగాయి. అప్పట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నేతలను మాత్రమే కాదు అధికారులను సైతం విడిచిపెట్టలేదు. కరోనా కష్టకాలంలో మాస్కులు ఏవి అని అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ పై కక్ష కట్టింది వైసిపి ప్రభుత్వం. చాలా రకాలుగా వెంటాడింది. చివరకు ఆయన పై మెంటల్ ముద్ర వేసి పోలీసులు విశాఖ నడివీధుల్లో చూపిన కర్కశం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఆ మానసిక ఆవేదనతో డాక్టర్ సుధాకర్ కన్నుమూశారు. ఆయన చనిపోయిన విషయం అంత్యక్రియలు పూర్తయిన వరకు బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు. కానీ అప్పట్లో ఆయనపై వ్యవహరించిన తీరు మాత్రం అమానుషంగా ఉంది. అందుకే అప్పట్లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు డాక్టర్ సుధాకర్ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు.
* ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు..
కరోనా ప్రపంచాన్ని వణికించింది. లక్షలాదిమంది ప్రాణాలను ప్రాణాలను బలితీసుకుంది. అయితే అప్పట్లో ఫ్రంట్ వారియర్ గా( front Warrior) వైద్యులతో పాటు సిబ్బంది నిలిచారు. పారిశుద్ధ్య కార్మికులు సేవలందించారు. వైసిపి హయాంలో కోవిడ్ తీవ్రతరం చూపింది. అయితే ఆ సమయంలో ఆక్సిజన్ అందక కొందరు.. సరైన వైద్య సేవలు అందక మరికొందరు మృత్యువాత పొందారు. కానీ అటువంటి క్లిష్ట సమయంలో వైద్య సేవలు అందించే వారికి సైతం భద్రత కరువైంది. మాస్కులతో పాటు శానిటైజర్లు, ఇతర పరికరాలు అందేవి కావు. అటువంటి సమయంలో నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడంతో వైసీపీ ప్రభుత్వానికి ఆయన టార్గెట్ అయ్యారు. అరెస్ట్ కూడా జరిగింది. మానసిక వ్యాధితో బాధపడుతున్నారని చెప్పి విశాఖ వీధుల్లో అర్థనగ్నంగా తిప్పారు డాక్టర్ సుధాకర్ ను. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా కలచివేసింది. అప్పటి ప్రతిపక్షనేతగా చంద్రబాబు సీరియస్ అయ్యారు. తాము అధికారంలోకి వస్తే బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
* కోటి రూపాయల సాయం..
ఒక ప్రభుత్వం కక్ష కడితే ఎంతలా వేటాడ వచ్చో సుధాకర్ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వం చేసి చూపించింది. అయితే ఒక ప్రభుత్వం మనసు పెడితే ఎంతలా స్వాంతన కలిగించవచ్చో ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం చేసింది. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి కోటి రూపాయలు సాయం ప్రకటించింది. ఆపై ఆయన కుమారుడు లలిత్ ప్రసాద్కు పదోన్నతి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆయన సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ఆయన చదువు అర్హతను బట్టి ప్రమోషన్ కల్పించాలని నిర్ణయించారు. నిజంగా ఇది గొప్ప విషయం. ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే ఈ విషయంలో టిడిపి సర్కార్ అభినందనలు అందుకుంటోంది.