Homeఎంటర్టైన్మెంట్Gunde Ninda Gudigantalu: 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ నుండి తప్పుకున్న బాలు.. కొత్త హీరో...

Gunde Ninda Gudigantalu: ‘గుండె నిండా గుడిగంటలు’ సీరియల్ నుండి తప్పుకున్న బాలు.. కొత్త హీరో ఎంట్రీ.. కారణం ఏంటంటే..

Gunde Ninda Gudigantalu: స్టార్ మా ఛానల్ లో ప్రస్తుతం అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకొని , నెంబర్ 1 స్థానం లో దూసుకుపోతున్న సీరియల్ ‘గుండె నిండా గుడిగంటలు’. ఈ సీరియల్ అంటే కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రమే కాదు , యూత్ ఆడియన్స్ కి కూడా చాలా ఇష్టం. ముఖ్యంగా ఈ సీరియల్ లోని డ్రామా , ఎమోషన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చింది. అందుకే 743 ఎపిసోడ్స్ ని […]

Gunde Ninda Gudigantalu: స్టార్ మా ఛానల్ లో ప్రస్తుతం అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకొని , నెంబర్ 1 స్థానం లో దూసుకుపోతున్న సీరియల్ ‘గుండె నిండా గుడిగంటలు’. ఈ సీరియల్ అంటే కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రమే కాదు , యూత్ ఆడియన్స్ కి కూడా చాలా ఇష్టం. ముఖ్యంగా ఈ సీరియల్ లోని డ్రామా , ఎమోషన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చింది. అందుకే 743 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకొని వెయ్యి ఎపిసోడ్స్ వైపు పరుగులు తీస్తోంది ఈ సీరియల్. ఇందులో హీరో , హీరోయిన్లు గా నటించిన విష్ణు , అమూల్య లకు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలు రేంజ్ లో రాలేదు అనే చెప్పాలి. బాలు – మీనా క్యారెక్టర్స్ పోషించిన వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ ని చూసి నచ్చనోళ్లు అంటూ ఎవ్వరూ ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే ఈ సీరియల్ లో హీరో గా నటిస్తున్న విష్ణు , త్వరలోనే తప్పుకోనున్నాడని , ఆయన స్థానం లో మరో హీరో వచ్చే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియా లో తెగ ప్రచారం సాగుతూ వస్తోంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని బాలు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు నిజంగానే ఈయన ఈ సీరియల్ కి తాత్కాలిక బ్రేక్ ఇవ్వబోతున్నాడని మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అందుకు ముఖ్య కారణం విష్ణు కి ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ రావడం వల్లే అని అంటున్నారు. ‘బిగ్ బాస్’ టీం ఈయన్ని షో లోకి తీసుకునేందుకు గత కొద్దిరోజుల నుండి సంప్రదిస్తూనే ఉన్నారట. రెమ్యూనరేషన్ కూడా ఎవ్వరూ ఊహించని రేంజ్ ఆఫర్ చేశారట. ఈ ఆఫర్ పై ఇంతకాలం మౌనం గా ఉంటూ వచ్చిన విష్ణు , ఇప్పుడు ఒకే చెప్పినట్టు సమాచారం.

ప్రస్తుతం విష్ణు ‘గుండె నిండా గుడిగంటలు’ సీరియల్ తో పాటు , జెమినీ టీవీ లో ప్రసారమయ్యే ‘మా ఇంటి దేవత’ అనే సీరియల్ లో కూడా నటిస్తున్నాడు. ఈ రెండు సీరియల్స్ కి బ్రేక్ చెప్పి ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ‘గుండె నిండా గుడిగంటలు’ సీరియల్ లో కొత్త హీరో గా ఎవరు కనిపించబోతున్నారు అనే దానిపైన కూడా సోషల్ మీడియా లో ఒక చర్చ నడుస్తోంది. హీరోయిన్ అమూల్య కి కాబోయే భర్త నిరంజన్ ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటించబోతున్నాడని టాక్. ఈయన కూడా సీరియల్ హీరోనే. గతం లో స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ‘ఎన్నెన్నో జన్మల బంధం’, ‘సత్యభామ’ సీరియల్స్ లో ఈయన హీరో గా నటించాడు. మరి ‘గుండెల నిండా గుడిగంటలు’ లో విష్ణు ని తలపించే నటన నిరంజన్ చేస్తాడో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper