Washing eyes with urine: శరీరంలో 60% నీరు ఉంటుందని సైన్స్ చెబుతుంది. అయితే ఈ నీటి శాతం తక్కువగా అయినప్పుడు దాహం వేస్తుంది. దీంతో మళ్లీ దానిని కవర్ చేసేందుకు మీరు తాగుతూ ఉంటాం. అయితే ఈ నీరు ఆహారం జీర్ణం అవ్వడానికి ఉపయోగపడి ఆ తర్వాత శుద్ధి చేయబడి చివరకు వ్యర్థమైన నీరు మూత్ర నాళాల ద్వారా బయటకు వెళ్తుంది. ఇలా బయటకు వెళ్లిన మూత్రం ఏ విధంగాను పనికిరాదు అని అందరికీ తెలుసు. కానీ మూత్రంతో కళ్ళు కడుక్కోవడం వల్ల ఎంతో ఆరోగ్యమని ఓ మహిళా చెబుతోంది. అంతేకాకుండా ఆమె స్వయంగా ఈ పని చేసి వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియో పై స్పందన ఎలా ఉందంటే?
గోమూత్రం తాగడం వల్ల ఎంతో ఆరోగ్యమని చాలామంది దీనిని పాటిస్తారు. అయితే మాజీ ప్రధాని మొరార్జీ దేశాయి మనిషి మూత్రం తాగడం వల్ల ఎంతో కాలం జీవించాడని కొందరు చెబుతుంటారు. అంతేకాకుండా ఎక్కువ కాలం జీవించిన ప్రధానుల్లో ఈయన ఉన్నట్లు పేర్కొంటారు. మనిషి మూత్రం తాగడం వల్ల ఎంతో ఆరోగ్యమని ఈ విషయాన్ని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు.
అయితే పూణే కు చెందిన నుపూర్ పిట్టి అనే ఓ మహిళ మూత్రంతో కళ్ళు కడుక్కోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటాయని తెలిపింది. అంతేకాకుండా ఆమె ఒక రెండు పాత్రల్లో మొత్తాన్ని తీసుకుంది. ఆ పాత్రలను కళ్ళ దగ్గర ఉంచి వాష్ చేసుకుంది. సాధారణంగానే ఆమె ఔషధాలకు దూరంగా ఉంటుంది. అందులో భాగంగా ఇలా నాచురల్ గా కళ్ళను కడుక్కోవాలని సూచించింది. అంతేకాకుండా ఆమె చేసిన ఈ వీడియోను నెక్స్ట్ ఖాతాలో ఉంచుతూ’సహజ నివారణ’అనే క్యాప్షన్ను పెట్టింది. ప్రతిరోజు ఉదయం ఇలా మూత్రంతో కళ్ళు కడుక్కోవడం వల్ల కళ్ళలో ఉన్న మలినం పోతుందని.. అలాగే కళ్ళు ఎరుపు బారిన నుంచి రక్షించబడుతుందని పేర్కొంది.
కొంతమందికి ఇది పిచ్చిగా అనిపించినా ఇది ఆరోగ్యకరమే అని ఆమె పేర్కొంది. అయితే ఆమె పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా లక్షల వ్యూస్ వచ్చాయి. అయితే ఈ వీడియో పై కొందరు కామెంట్లు చేశారు. డాక్టర్ సిరియాక్ అభి ఫిలిప్స్ ఈ పద్ధతిని వ్యతిరేకించారు. మూత్రం ఎన్నో మలినాలతో కలిసి ఉంటుంది.. దీనితో కళ్ళు కడుక్కోవడం వల్ల ఆరోగ్యం కాదని అన్నారు. అంతేకాకుండా ఈ సలహా ఎవరికి ఇవ్వొద్దని పిట్టిని కోరారు. మరికొందరు కామెంట్ చేస్తూ మూత్రంలో ఆమ్లం కలిసి ఉంటుంది.. దీనిని కళ్ళలో ఉంచడం వల్ల కళ్ళు దెబ్బతింటాయి అని పేర్కొన్నారు. ఇది ఎంతవరకు నిరూపించగలరు అని చెప్పారు. అయితే కొందరు మాత్రం ఆమె సహజ నివారణ కోసం సోషల్ మీడియాలో చెప్పే హక్కు ఉందని అన్నారు. పాటించడం పాటించకపోవడం ప్రజలు నిర్ణయించుకోవాలి అని చెప్పారు. ఏది ఏమైనా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Please don’t put your urine inside your eyes. Urine is not sterile.
Boomer aunties trying to be cool on Instagram is depressing…and terrifying.
Source: https://t.co/SQ5cmpSOfY pic.twitter.com/qgryL9YHfI
— TheLiverDoc (@theliverdr) June 25, 2025