Fraud: ఈ భూమి మీద కోట్లకొద్దీ మనుషులు జీవిస్తున్నారు. కానీ ఒకరికి మరొకరు సంబంధం లేదు అన్నట్లు వ్యవహరిస్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రం తమకు కావలసినవారు.. తమ బంధువులు.. తమ స్నేహితులు అని భావిస్తూ ఉంటారు. అయితే ఇలా అనుకున్న వారందరూ మంచివారై ఉంటారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే దగ్గరి వారు.. మనవారు అనుకున్న వారే ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. అయితే మనం చేసే తప్పులతోనే మనం మోసపోతూ ఉంటామని మనకు తెలియదు. అలాంటి వాటిలో ఈ ఐదు విషయాల్లో మీరు ఎప్పటికీ మోసపోతూనే ఉంటారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఇతరులకు సేవ:
చాలామంది తమ వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా ఇతరులకు సేవ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. తమకంటే ఎక్కువగా ఇతరులు బాగుపడాలని కోరుకుంటారు. అయితే ఎప్పటికీ ఇలా సేవ చేస్తూ పోతూ ఉంటే వారు సేవ చేయించుకుంటూనే ఉంటారు. చివరికి వారికి ఒక్కసారి నచ్చకపోయినా దూరం పోతుంటారు. ఇన్నాళ్లు వారిపై ఆశలు పెట్టుకునే వారు ఉంటే ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది. అందువల్ల ఇతరులకు సేవ చేస్తూనే వ్యక్తిగత ప్రయోజనాలకు విలువలు ఇవ్వాలి.
పదేపదే క్షమించడం:
మనకు దగ్గర వారు ఎవరైనా.. కొన్ని తప్పులు చేస్తే క్షమిస్తూ ఉంటాం. కానీ అలా పదే పదే తప్పులు చేసినా క్షమించుకుంటూ పోతే.. వారు ఎప్పటికీ తప్పులు చేస్తూనే ఉంటారు. అలా తప్పులు చేయడం వల్ల ఏదో ఒక రోజు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే రెండుసార్లు తప్పు చేసిన తర్వాత మూడోసారి క్షమించే అవకాశం ఇవ్వకుండా ఉండాలి.
ఎవరికి నో చెప్పలేకపోవడం:
ఒక పని చేయమని ఎవరైనా అడిగితే నో చెప్పకుండా వెంటనే చేయడానికి రెడీ అవుతూ ఉంటాం. అయితే ఇలా ప్రతి విషయంలో చేసుకుంటూ పోతే వ్యక్తిగతంగా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల సాధ్యం కానీ పనికి నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. అలా నో చెప్పడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. లేకుంటే మీకు అవసరం లేని పనులకు మీరు కష్టపడాల్సి వస్తుంది.
అందరికీ సహాయం చేయాలి:
అందరికీ సహాయం చేయాలి. అందరినీ ఆదుకోవాలి. అందరూ బాగుండాలి అని కోరుకోవడం తప్పే. ఎందుకంటే అందరిలో కొందరు మాత్రమే మనతో బాగుంటారన్న విషయం గ్రహించాలి. మిగతావారిలో కొందరు శత్రువులు కూడా ఉంటారు. అయితే వారు ఎప్పుడో ఒకప్పుడు కాటు వేసే ప్రమాదం ఉంది. అందువల్ల గుడ్డిగా ఇతరులకు సహాయం చేయడం మానుకోవాలి. లేకుంటే తీవ్ర నష్టాలు జరిగే అవకాశం ఉంది.
నమ్మకద్రోహం:
మీరు ఎవరి మాటైతే వింటారో.. వారు ఎక్కువగా మోసం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వారి స్వార్థ ప్రయోజనాలకు తప్పుడు దారులు చెబుతారు. వారి అవసరాలు తీర్చేందుకు మీతో పని చేయించుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏ ఒక్కరి మాట వినకుండా సొంతంగా ఆలోచించుకునే తెలివి సంపాదించుకోవాలి.