Varanasi Movie : ‘వారణాసి’ చిత్రం షూటింగ్ అనుకున్న దానికంటే వేగంగా జరుగుతోంది. అప్పుడే 80 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేశారంటూ రాజమౌళి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కూడా చెప్పుకొచ్చాడు. ఏప్రిల్ 7 , 2027 లో ఎట్టి పరిస్థితిలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేసేలా అన్ని విధాలుగా సిద్ధం అవుతున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది , షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది అంటున్నారు, మరి ఈ సినిమా నుండి టీజర్ వదలడానికి రాజమౌళి ఇంకా ఎందుకు సుముఖత చూపించడం లేదంటూ అభిమానులు నిలదీస్తున్నారు. నేడు మహేష్ బాబు పుట్టిన రోజు. కచ్చితంగా వారణాసి నుండి ఎదో ఒక బ్లాస్టింగ్ అప్డేట్ ఉంటుందని ఆశించారు. సినిమా నుండి టీజర్ , లేదా కనీసం మహేష్ బాబు శ్రీరాముడి గెటప్ లో ఉన్న లుక్ ని అయినా రిలీజ్ చేస్తారని అనుకున్నారు.
కానీ చాలా సింపుల్ గా ‘వారణాసి’ షూటింగ్ సమయం లో తీసుకున్న కొన్ని ఫోటోలను విడుదల చేసారు అంతే. ఈ ఫోటోలను చూస్తుంటే ‘మౌంటెన్ డ్యూ ‘ యాడ్ ఫోటోలు లా ఉన్నాయని , పెద్దగా ఆకట్టుకోలేదు అంటూ మహేష్ ఫ్యాన్స్ సైతం ట్వీట్లు వేస్తున్నారు. ఇక యాంటీ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్న ఛాన్స్ దొరికినా ట్రోల్స్ చేయడానికి రెడీ గా ఉంటారు. అలాంటిది ఇలాంటి పోస్టర్లు విడుదల చేస్తే ట్రోల్ చేయకుండా ఉండరు కదా. ప్రస్తుతం అలాంటి ట్రోల్స్ సోషల్ మీడియా లో నడుస్తున్నాయి. సినిమా పూర్తి అయ్యేంత వరకు టీజర్ లాంటివి విడుదల చెయ్యకూడదు అని రాజమౌళి చాలా కచ్చితంగా ఉన్నట్టు ఉన్నాడు. అందుకే ఇలా సింపుల్ అప్డేట్స్ తో సరిపెడుతున్నదని అంటున్నారు విశ్లేషకులు. దీనిపై రాబోయే రోజుల్లో రాజమౌళి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాడో చూడాలి.
మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అప్లోడ్ చేసిన ఆ ఫోటోలను మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్స్ రూపం లో తెలియజేయండి. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా, విలన్ గా మలయాళం హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ఈ చిత్రం లో మహేష్ బాబు కి తండ్రిగా కనిపించబోతున్నారు. దాదాపుగా 1400 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని పాన్ వరల్డ్ రేంజ్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాతో హాలీవుడ్ మార్కెట్ లో పాగా వెయ్యాలని చూస్తున్నాడు రాజమౌళి.
A little more of Rudhra’s world… #Varanasi @ssrajamouli @VaranasiMovie pic.twitter.com/3PJ9kBwOaO
— Mahesh Babu (@urstrulyMahesh) August 9, 2026