Life: జీవితంలో పైకి ఎదగాలంటే కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉండాలి. ముఖ్యంగా సమాజంలో ఉన్న మనుషులను అర్థం చేసుకోవడానికి.. వారితో కలిసి పోవడానికి మనకు పుట్టుకతో వచ్చిన కొన్ని లక్షణాలతో పాటు మరికొన్నిటిని నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటిలో ప్రధానంగా సిగ్గు అనేది విడిచి పెట్టాలి. సిగ్గు లేకుండా కొన్ని పనులు చేయడం వల్ల మనం ఎంతో సంతోషంగా ఉండగలుగుతాం. మరి బిడియం విడిచిపెట్టి చేసే మంచి పనులు ఏవో ఇప్పుడు చూద్దాం..
ప్రశ్నలు అడగడం:
చాలామంది స్కూల్ నుంచి బిడియం గా ఉంటారు. తమకు చదువుకునేటప్పుడు లేదా ఉద్యోగం చేసేటప్పుడు ఎన్నో రకాల సందేహాలు వస్తూ ఉంటాయి. కానీ వాటిని నివృత్తి చేసుకోవడానికి ధైర్యం ఉండదు. దీంతో వారు ఏదైనా ప్రశ్న అడగడానికి సంకోచిస్తారు. ఇలా ప్రశ్న అడగలేక పోవడానికి వారిలో సందేహం ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. ఆ ప్రశ్న మానసికంగా ఎప్పటికీ కుంగతీస్తూనే ఉంటుంది. అందువల్ల ప్రశ్నలు అడిగే అలవాటును చేసుకోండి. ప్రశ్నలు అడిగే అలవాటు పై కొందరు హేళన చేసే అవకాశం ఉంటుంది. అయినా కూడా వారిని పట్టించుకోకుండా ఈ అలవాటును చేసుకోవాలి.
పాత దుస్తులు వేసుకోవడం:
ఆర్థికంగా ఏమాత్రం బాగా లేకున్నా కొందరు ఎప్పటికప్పుడు కొత్త దుస్తులు ధరించాలని కోరుతూ ఉంటారు. అయితే డబ్బు సంపాదించేవారు ఇలా వేసుకుంటే పర్వాలేదు. కానీ డబ్బు లేకుండా కూడా అధికంగా ఖర్చుపెట్టి కొత్త బట్టలు వేసుకోవాలని కోరుకోవడం సమంజసం కాదు. ఆర్థికంగా నిలదొక్కు కొనేవరకు పాత దుస్తులను వేసుకుంటూ ఉండాలి. ఇలా వేసుకోవడానికి చాలామంది సిగ్గుపడతారు. ఇలాంటి విషయంలో ఏమాత్రం సిగ్గులు పడకుండా పాత దుస్తులను వేసుకొని డబ్బులను పొదుపు చేసుకోవాలి. అప్పుడే ఆర్థికంగా బాగుపడతారు.
నాకు తెలియదు అని చెప్పడం:
కొంతమందిని ఎవరైనా ప్రశ్నలు అడిగితే తెలియదు అని చెప్పడం ఇష్టం ఉండదు. అలా చెబితే నలుగురిలో చిన్నతనం అవుతుందని భావించి ఏదో ఒకటి చెబుతూ ఉంటారు. కానీ ఇలా చెప్పడం వల్ల భవిష్యత్తులో వారి విలువ తగ్గిపోతుంది. ఒక విషయం గురించి తెలియకపోతే తెలియదనే చెప్పాలి. అలా చెప్పడం వల్ల వారి మనస్తత్వాన్ని ఎదుటివారు అర్థం చేసుకుని అవకాశం ఉంటుంది. ఫలితంగా వారికి సరైన సలహాలు, సూచనలు కూడా ఇవ్వడానికి ఎదుటివారు ఇష్టపడతారు.
వృద్ధులతో కలిసిమెలిసి ఉండడం:
ప్రస్తుత కాలంలో చాలామంది వృద్ధులతో కలిసి ఉండడానికి ఇష్టపడరు. ముఖ్యంగా అమ్మానాన్న దగ్గరికి వెళ్లడానికే చాలామంది ఆసక్తి చూపరు. కానీ ఇలా చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎవరు ఏమీ అనుకున్నా.. అనుకోకపోయినా వృద్ధులకు సహాయం చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే వారితో కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయాలి. అలా ఉండడంవల్ల వారి నీ సంతోషపెట్టిన వాళ్ళు అవుతారు.
సాదాసీదాగా జీవితాన్ని గడపడం:
డబ్బు లేకున్నా కూడా లగ్జరీగా లైఫ్ ఉండాలని కోరుకునే వారు చాలామంది ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల అప్పుల పాలై ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారు. తమకు ఎంతవరకు డబ్బు ఉందో.. అంతలోనే జీవించడం అలవాటు చేసుకోవాలి. గోపాలకు పోతే తిప్పలు పడి అప్పుల పాలవుతారు.