Homeఆధ్యాత్మికంMaha Kumbamela 2025: ఇంట్లో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. కుంభమేళా నుంచి వీటిని తీసుకురండి

Maha Kumbamela 2025: ఇంట్లో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. కుంభమేళా నుంచి వీటిని తీసుకురండి

Maha Kumbamela 2025: ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవాల్లో మహా కుంభమేళా ఒకటి. ఈ కుంభ మేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో దీన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పా్ట్లు అన్ని కూడా పూర్తి అయ్యాయి. ఈ మహా కుంభమేళాకి లక్షలాది భక్తులు వెళ్తుంటారు. పవిత్ర నదులు అయిన గంగా, యమునా, సరస్వతి మూడు నదుల సంగమంలో స్నానం చేయడానికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. మొత్తం నాలుగు ప్రదేశాల్లో ఈ మహా కుంభమేళా జరుగుతుంది. అలహాబాద్ ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లో జరుగుతుంది. ఎంతో అంగరంగవైభవంగా జరిగే ఈ మహా కుంభమేళాను అసలు ఎందుకు 12 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. వివిధ దేశాల నుంచి కూడా ఈ కుంభమేళాకు భక్తులు వెళ్తుంటారు. అయితే ఈ మహా కుంభమేళా మొదటి స్నానం అనేది జనవరి 13వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. దీనికి స్నానానికి వెళ్లిన వారు ప్రయాగ్ రాజ్ నుంచి కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల శతృ బాధలు అన్ని కూడా తొలగిపోయి.. కుటుంబంలో సంతోషాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. మరి కుంభమేళా నుంచి ఇంటికి తీసుకురావాల్సిన ఆ వస్తువుల ఏంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

కనుమల నేల
గంగా ఘాట్ నేల చాలా పవిత్రమైనది. ఈ గంగా ఘాట్ దగ్గర నుంచి కనీసం పిడికిడి మట్టి అయిన ఇంటికి తీసుకురావాలని పండితులు చెబుతున్నారు. ఇలా తీసుకొచ్చిన మట్టిని తులసి మొక్కలో వేయడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. ఎలాంటి గ్రహా దోషాలు, ఆర్థిక సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారని చెబుతున్నారు.

త్రివేణి సంగమం నీరు
ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ఎక్కువగా స్నానాలు చేస్తారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు అన్ని కూడా తొలగిపోతాయని నమ్ముతారు. అయితే ఈ త్రివేణి సంగమం నుంచి నీరు ఇంటికి తీసుకొచ్చి చల్లితే ఇంట్లో ఉన్న గ్రహ, వాస్తు దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. త్రివేణి ఘాట్‌ నుంచి తీసుకొచ్చిన నీటిని స్నానం చేసే వాటర్‌లో కలపడం వల్ల మానసిక సమస్యలు అన్ని కూడా క్లియర్ అయి ప్రశాంతంగా ఉంటారు.

తులసి పూసలు, రుద్రాక్ష
హిందూ మతంలో రుద్రాక్ష, తులసి మాలకి ఓ ప్రత్యేకత ఉంది. ఎంతో పవిత్రంగా వీటిని భావిస్తారు. అయితే మహా కుంభమేళాలో స్నానం చేసిన తర్వాత వీటిని ఇంటికి తీసుకు వస్తే.. ప్రతికూలతలు అన్ని కూడా తొలగిపోతాయి. మీ జీవితం కూడా ఇంతకు ముందు కంటే బెటర్‌గా ఉంటుందని పండితులు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని మర్చిపోయి రావద్దు.

ప్రసాదం
ప్రయాగ్‌రాజ్‌లో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఈ మహా కుంభమేళాలో స్నానం చేసిన తర్వాత ఆలయాలను సందర్శించాలి. అలాగే అక్కడి ప్రసాదాలను తప్పకుండా ఇంటికి తీసుకురావాలని పండితులు చెబుతున్నారు. ఇలా ఇంటికి తీసుకురావడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.

పువ్వులు
మహా కుంభమేళా నుంచి పువ్వులను ఇంటికి తీసుకురావడం వల్ల ఇంటిలో సుఖసంతోషాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఏదైనా ఆలయం నుంచి వీటిని తీసుకొస్తే ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇవి ఇంట్లో ఆనందం, శాంతిని కలిగించడంతో పాటు గ్రహ దోషాలను కూడా తొలగిస్తాయని అంటారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలు కోసం పండితులను సంప్రదించగలరు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Oktelugu Epaper