Vijay Bhaskar: చైల్డ్ ఆర్టిస్టుగా ఉన్నప్పుడే ప్రేక్షకులను తన అద్భుతమైన నటనతో విశేషంగా ఆకట్టుకున్న నటుడు తరుణ్(Hero Tarun). ఆ తర్వాత పెద్దయ్యాక హీరో గా ఎంట్రీ ఇస్తూ ఆయన నటించిన ‘నువ్వే కావాలి’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి, ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. కొన్ని సెంటర్స్ లో అయితే సంవత్సరం రోజులకు పైగా ఆడింది. ఈ సినిమా తర్వాత తరుణ్ హీరో గా నటించిన ‘ప్రియమైన నీకు’, ‘నువ్వు లేక నేను లేను’, ‘నువ్వే నువ్వే’, ‘ఎలా చెప్పను’, ఇలా వరుసగా రొమాంటిక్ లవ్ స్టోరీస్ చేస్తూ, హిట్టు మీద హిట్టు కొడుతూ అతి తక్కువ సమయం లోనే ఆరోజుల్లో స్టార్ హీరోగా ఎదిగాడు.
అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కాదు, తరుణ్ స్క్రిప్ట్ సెలక్షన్ గాడి తప్పింది. ఫలితంగా వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. ఆ కారణం చేత ఎంత వేగంగా ఇండస్ట్రీ లో ఎదిగాడో, అంతే వేగంగా క్రిందకు పడిపోయాడు. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమై, వ్యాపార రంగం లోకి అడుగుపెట్టి, అక్కడే స్థిరపడిపోయాడు తరుణ్. అయితే తరుణ్ కెరీర్ గురించి ఆయనతో ‘నువ్వే కావాలి’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన ‘విజయ్ భాస్కర్’ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘తరుణ్ చాలా సహజ నటుడు. మంచి టాలెంట్ ఉన్న అబ్బాయి. కానీ అతను మొదటి నుండి లవర్ బాయ్ రోల్స్ చేయడం వల్ల, ఆడియన్స్ అతన్ని లవర్ బాయ్ గానే గుర్తు పెట్టుకున్నారు. కానీ తరుణ్ కి తన ఇమేజ్ ని మార్చుకోవాలి, ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి అనే కోరిక పుట్టింది. ఆ క్రమంలోనే ఆయన యాక్షన్ సినిమాలు ప్రయత్నం చేశాడు. అవి వరుసగా ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి, కెరీర్ నాశనం అయ్యింది. ఒకవేళ తరుణ్ లవర్ బాయ్ లాగానే కొనసాగి ఉండుంటే ఇప్పటికీ స్టార్ హీరో లీగ్ లోనే కొనసాగుతూ ఉండేవాడు’ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ భాస్కర్.
