Simbu Love Story Nidhi Agarwal : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు నిధి అగర్వాల్(Nidhi aggarwal). ఈమె కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలు చాలా తక్కువే. కానీ తన అందంతో, నటనతో, డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టిపారేసింది. అయితే నిధి అగర్వాల్ కి ఇప్పుడు అత్యంత కీలకమైన సమయం. ఆమె కెరీర్ వేరే లెవెల్ కి వెళ్తుందా?, లేకపోతే ఇలాగే మీడియం రేంజ్ హీరోయిన్ గా మిగిలిపోతుందా అనేది నిర్ణయింపబడే సమయం. ఎందుకంటే ఆమెకు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) అనే చిత్రం, అదే విధంగా ప్రభాస్(Rebel Star Prabhas) తో ‘ది రాజా సాబ్'(The Rajasaab) అనే చిత్రం లో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. ఒకే సమయంలో పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి సూపర్ స్టార్స్ సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం అందరికీ రాదు.
ఇక ఆమె హీరోయిన్ గా నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఈ నెల 12 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రొమోషన్స్ లో భాగంగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈమె తమిళం లో శింబు(Silambarasan TR) తో కలిసి ‘ఈశ్వరన్’ అనే చిత్రం చేసింది. ఈ సినిమా చేసినప్పటి నుండి వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్ వినిపించింది. సోషల్ మీడియా లో ఈ వార్త ఒక వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెందింది. ఈ వార్త పై నిధి అగర్వాల్ రీసెంట్ గా జరిగిన ఈ ఇంటర్వ్యూ లో స్పష్టమైన క్లారిటీ ఇవ్వగా, దానిని ఆమె అభిమానులు సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు.
Also Read : ఈమె అందానికి ముగ్ధులయ్యి గుడి కట్టి పూజిస్తున్న అభిమానులు.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే..
ఆమె మాట్లాడుతూ ‘ ఒక అమ్మాయి హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పుడు ఆమె గురించి పుకార్లు రావడం సర్వసాధారణం. ముఖ్యంగా ఆమె వివాహం గురించి, ఎవరితో అఫైర్స్ పెట్టుకుంది అనే దాని గురించి ఎక్కువగా వార్తలు ప్రచారం చేస్తుంటారు. ఎందుకంటే జనాలు పుకార్లకు చాలా తేలికగా కనెక్ట్ అవుతారు కాబట్టి. నా మీద కూడా ఇలాంటి రూమర్స్ ఎన్నో ప్రచారం జరిగాయి. కానీ నేను వాటిని పెద్దగా పట్టించుకోను అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉండగా ‘హరి హర వీరమల్లు’ చిత్రం కోసం ఈమె రెండేళ్ల పాటు ఏ సినిమాకు కమిట్ అవ్వకూడదు అనే ఒప్పందాన్ని కూడా నిర్మాతతో చేసుకుంది. కానీ సినిమా ఆలస్యం అవ్వడంతో వేరే ప్రాజెక్ట్స్ కి షిఫ్ట్. ప్రస్తుతం ఆమె చేతిలో ఈ రెండు సినిమాలే ఉన్నాయి. ఈ సినిమాల ఫలితాలే ఆమె భవిష్యత్తుని నిర్ణయించబోతున్నాయి.