Homeబిజినెస్indian currency notes : మీ చేతిలోని కరెన్సీ నోటు ఎక్కడ ముద్రించారో తెలుసా?

indian currency notes : మీ చేతిలోని కరెన్సీ నోటు ఎక్కడ ముద్రించారో తెలుసా?

indian currency notes : రోజువారీ జీవితంలో నగదు లేకుండా ఏ పని జరగదు. టీ కొనుగోలు నుంచి పెద్ద లావాదేవీల వరకు కరెన్సీ నోట్లు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుత ఆర్థిక వ్యవహారాల్లో డిజిటల్ చెల్లింపులు జరుగుతన్నా.. కొన్ని సందర్భాల్లో కరెన్సీ నోట్లు ప్రాధాన్యంగా ఉంటాయి. అయితే మనం ప్రతిరోజూ ఉపయోగించే ఈ నోట్లు ఎక్కడ ముద్రిస్తారు? అనే విషయం తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. భారతదేశంలో 4 చోట్ల కరెన్సీని ప్రింట్ చేస్తారు. కొన్ని […]

indian currency notes : రోజువారీ జీవితంలో నగదు లేకుండా ఏ పని జరగదు. టీ కొనుగోలు నుంచి పెద్ద లావాదేవీల వరకు కరెన్సీ నోట్లు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుత ఆర్థిక వ్యవహారాల్లో డిజిటల్ చెల్లింపులు జరుగుతన్నా.. కొన్ని సందర్భాల్లో కరెన్సీ నోట్లు ప్రాధాన్యంగా ఉంటాయి. అయితే మనం ప్రతిరోజూ ఉపయోగించే ఈ నోట్లు ఎక్కడ ముద్రిస్తారు? అనే విషయం తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. భారతదేశంలో 4 చోట్ల కరెన్సీని ప్రింట్ చేస్తారు. కొన్ని నోట్లు ఎక్కడ ప్రింటయ్యాయో కొన్ని కోడ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ వివరాల్లోకి వెళితె..

ఒక కరెన్సీ నోటు ఎక్కడ ప్రింట్ అయిందో దీనిపై కోడ్ ఉంటుంది. కరెన్సీ నోటు పైభాగం లేదా కింద భాగంలో చిన్న ఇంగ్లీష్ అక్షరం కనిపిస్తుంది. ఈ అక్షరాన్ని ఇన్ సెట్ లెటర్ అని అంటారు. దీనిని ఆధారంగా చేసుకుని ఆ నోటు ఏ ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించబడిందో గుర్తించే అవకాశం ఉంటుంది. ఒక నోటుపై A, B, C, D అనే లెటర్లో ఏదీ ఒకటి ఉన్నా.. దీనిని కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు ప్రింటింగ్ ప్రెస్ లో తయారు చేశారని అర్థం చేసుకోవాలి.

అలాగే E, F, G, H, K అని ఉంటే మధ్య ప్రదేశ్లోని దివాస్.. L, M, N, P, Q అని ఉంటే మహారాష్ట్రలోని నాసిక్.. R, S, T, U, V అని ఉంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సెల్బోనీలో ముద్రించారని అర్థం. ఈ నాలుగు ముద్రణ కేంద్రాల్లో నాసిక్, దివాస్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. మిగతారెండు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కరెన్సీ నోట్లు ప్రింట్ చేశారు.

అయితే కొన్ని కరెన్సీ నోట్లపై ఇన్‌సెట్ లెటర్ కనిపించకపోవచ్చు. గతంలో ఇలాంటి నోట్లు ఎక్కువగా మైసూరు ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించబడ్డాయని ప్రచారం జరిగింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి లెటర్ లేని నోటు మైసూరులోనే ముద్రించబడిందని ఖచ్చితంగా చెప్పలేము. కొన్ని సిరీస్‌లలో లేదా ప్రత్యేక ముద్రణల్లో ఇన్‌సెట్ లెటర్‌ను ఉద్దేశపూర్వకంగా ముద్రించకపోవచ్చు.

ఈ ఇన్‌సెట్ లెటర్ అనేది కేవలం ప్రింటింగ్ ప్రెస్‌ను గుర్తించడానికి మాత్రమే కాకుండా, నోట్ల ఉత్పత్తి, పంపిణీ, నాణ్యత నియంత్రణ, రికార్డుల నిర్వహణలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినా లేదా నోట్లను ట్రాక్ చేయాల్సి వచ్చినా ఈ గుర్తులు అధికారులకు ఉపయోగపడతాయి.

 

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper