bay leaf benefits : ప్రకృతిలో లభించే ఎన్నో రకాల మొక్కలు ఆరోగ్యాన్ని అందిస్తాయి. అయితే కొన్ని ఆకులు మన వంటింట్లోనే ఉంటాయి. కానీ ఇవి ఇచ్చే ప్రయోజనాల గురించి కొంత మందికి మాత్రమే తెలుసు. దీంతో వారు ఎప్పటికీ వాటిని వంటల్లో ఉపయోగిస్తుంటారు. అలాంటి వాటిలో ఒక్క బిర్యానీ ఆకు.. శరీరానికి అవసరమైన ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు ఇంట్లో ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కార మందుగా ఉపయోగపడుతుంది. ఆవేంటో చూద్దాం..
మనం మసాలా కూరలు లేదా బిర్యానీని తయారు చేసుకునేటప్పుడు బిర్యానీ ఆకును చూస్తాం.. ఇది కేవలం సువాసన కోసమే వాడుతామని చాలా మందికి తెలుసు. కానీ దీని వల్ల ఇంట్లో ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కారంగా నిలుస్తుంది. ముఖ్యంగా వంటిట్లోకి పురుగులురాకుండా.. ఇంట్లోకి దోమలు రాకుండా అడ్డుకుంటుంది. అలాగే మంచి నిద్ర పట్టడానికి ఇది ఆరోగ్య ప్రదాయినిగా నిలుస్తుంది.
ఈ ఆకులో ఉండే సహజ సువాసనతో వంటింట్లో ఉన్న పదార్థాలను కాపాడగలుగుతుంది. ముఖ్యంగా బియ్యం, పప్పులు, పిండి పదార్థాల్లో చేరే చిన్న కీటకాలను దూరంగా ఉంచడంలో కొంతవరకు సహాయపడుతుందని చెబుతారు. అందుకే చాలామంది బియ్యం డబ్బాలు, పప్పుల డబ్బాల్లో ఒకటి లేదా రెండు ఎండిన బిర్యానీ ఆకులను వేస్తుంటారు.
బిర్యానీ ఆకులోని సుగంధ నూనెల వాసన దోమలకు అంతగా ఇష్టంగా ఉండదని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కొందరు ఎండిన బిర్యానీ ఆకును కాల్చి వచ్చే పొగను ఉపయోగిస్తుంటారు. దీని వాసన వల్ల కొంతసేపు దోమలు దూరంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇది దోమల నివారణకు నిర్ధారితమైన లేదా దీర్ఘకాలిక పరిష్కారం కాదని మరికొందరు అంటారు.
ఇందులో ఉండే సుగంధ తైలాల వాసన కొందరిలో మనసుకు ప్రశాంతతను కలిగించి విశ్రాంతి భావనను కలిగించవచ్చు. అందువల్ల ఒత్తిడి తగ్గి నిద్రకు అనుకూల వాతావరణం ఏర్పడవచ్చు. బిర్యానీ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు, కొన్ని విటమిన్లు, ఖనిజాలు స్వల్ప మోతాదులో ఉంటాయి. వంటల్లో ఉపయోగించడం వల్ల ఆహారానికి సువాసనతో పాటు కొంత పోషక విలువ కూడా చేరుతుంది.
అయితే బిర్యానీ ఆకును నేరుగా కాల్చి వచ్చే పొగను ఎక్కువసేపు పీల్చకూడదు. చిన్న పిల్లలు, వృద్ధులు, ఆస్తమా లేదా ఇతర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు అలాంటి పొగకు దూరంగా ఉండటం మంచిది. అలాగే ఇంట్లో పురుగులు లేదా దోమలు అధికంగా ఉంటే కేవలం బిర్యానీ ఆకుపైనే ఆధారపడకుండా పరిశుభ్రత, సరైన నివారణ చర్యలు కూడా తీసుకోవాలి.