Homeఎంటర్టైన్మెంట్Jabardasth Rohini: నీకు అవకాశం ఇస్తే..నాకేమి ఇస్తావు ? ఆ వ్యక్తి గురించి సంచలన నిజాలు...

Jabardasth Rohini: నీకు అవకాశం ఇస్తే..నాకేమి ఇస్తావు ? ఆ వ్యక్తి గురించి సంచలన నిజాలు బయటపెట్టిన కమెడియన్ రోహిణి..

Jabardasth Rohini: సినీ ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎన్నో ఏళ్ళ నుండి ఉంది. దీన్ని కొంతమంది హీరోయిన్స్ అవకాశాల కోసం ఇప్పటికీ ప్రోత్సహిస్తుంటే , మరి కొంతమంది హీరోయిన్స్ మాత్రం వాటిని వ్యతిరేకిస్తూ ఇండస్ట్రీ నుండి వెళ్లిపోయారు. కొంతమంది అయితే ఫైర్ బ్రాండ్ లాగా ఉంటూ , క్యాస్టింగ్ కౌచ్ సమస్యని కూడా ధైర్యం ఎదురించి , తమ టాలెంట్ ని నమ్ముకొని , ఇండస్ట్రీ లో నేడు పెద్ద స్థాయిలో కొనసాగుతున్నారు. అలాంటి […]

Jabardasth Rohini: సినీ ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎన్నో ఏళ్ళ నుండి ఉంది. దీన్ని కొంతమంది హీరోయిన్స్ అవకాశాల కోసం ఇప్పటికీ ప్రోత్సహిస్తుంటే , మరి కొంతమంది హీరోయిన్స్ మాత్రం వాటిని వ్యతిరేకిస్తూ ఇండస్ట్రీ నుండి వెళ్లిపోయారు. కొంతమంది అయితే ఫైర్ బ్రాండ్ లాగా ఉంటూ , క్యాస్టింగ్ కౌచ్ సమస్యని కూడా ధైర్యం ఎదురించి , తమ టాలెంట్ ని నమ్ముకొని , ఇండస్ట్రీ లో నేడు పెద్ద స్థాయిలో కొనసాగుతున్నారు. అలాంటి వారిలో ఒకరు రోహిణి. ‘కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం’ అనే సీరియల్ తో బుల్లితెర ఆడియన్స్ కి పరిచయమైన ఈమె , ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించింది. ఆ క్రేజ్ తో బుల్లితెర పై ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోస్ లో కనిపిస్తూ వచ్చిన ఈమె, ‘బిగ్ బాస్ 8’ రియాలిటీ షో ద్వారా కోట్లాది మంది తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైంది.

అలా ఒక పక్క రియాలిటీ షోస్ , ఎంటర్టైన్మెంట్ షోస్ , వెబ్ సిరీస్ లు చేస్తూనే , మరో పక్క సినిమాలు కూడా చేస్తూ ఫుల్ బిజీ గా గడుపుతోంది రోహిణి. అయితే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో తనకు ఎదురైనా కొన్ని చేదు అనుభవాల గురించి రోహిణి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఆమె మాట్లాడుతూ ‘ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో ఒక సీరియల్ కోసం ఆడిషన్ కి వెళ్లాను. ఆ సమయం లో ఆ సీరియల్ నిర్మాతకు సంబంధించిన ఒక మేనేజర్ నేరుగా నా వద్దకు వచ్చి మాట్లాడుతూ నీకు అవకాశం ఇస్తే కచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాలి అన్నాడు. కానీ కమిట్మెంట్ అంటే ఇండస్ట్రీ లో అర్థం అప్పట్లో నాకు పూర్తిగా తెలియకపోవడం , కచ్చితంగా కష్టపడి కమిట్మెంట్ గా పని చేస్తానని , పని విషయంలో అసలు రాజీ పడే సమస్యే లేదని , ఎంతైనా కష్టపడుతాను అంటూ అతనితో చెప్పాను. కానీ తీరా అసలు విషయం తెలిసిన తర్వాత చాలా మనస్తాపానికి గురయ్యాను. వెంటనే ఈ విషయాన్ని ఇండస్ట్రీ లో నాకు బాగా పరిచయమున్న అంకుల్ కు చెప్పాను. ఆయన సదరు నిర్మాతకు ఫోన్ చేసి ఫుల్ క్లాస్ పీకారు. ఇది జరిగిన తర్వాత ఆ నిర్మాత నేను ఎప్పుడైనా నిన్ను కలిసి ఇలాంటివి అడిగానా? అంటూ పెద్దగా గొంటేసుకొని నాపై పడ్డాడు’ అంటూ చెప్పుకొచ్చింది రోహిణి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper