spot_img
Homeలైఫ్ స్టైల్Soy Milk:  సొయాపాలు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా?

Soy Milk:  సొయాపాలు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా?

Soy Milk:  మనలో చాలామంది అలర్జీలు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. పాలు, పాల సంబంధిత పదార్థాలను తినేవాళ్లలో కొంతమందిని ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్లు వేగన్ పాలు తాగితే మంచిది. ప్రపంచ దేశాల్లోని జనాభా సోయా పాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పలు అధ్యయనాలలో సైతం సోయా పాలు అత్యంత శ్రేష్టమైన పాలు అని వెల్లడైంది. ఆవుపాలను సోయా పాలు ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు.

సోయాబీన్స్ నుంచి సోయా మిల్క్ తయారు చేయగా ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. శరీరానికి అవసరమైన ఇనుము, ఫాస్ఫరస్‌, నియాసిన్‌, విటమిన్‌-సి సోయాపాల ద్వారా లభిస్తాయి. సోయా పాలు తాగడం ద్వారా ఊబకాయం నుండి రక్తపోటు వరకు ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. సోయాలోని ఐసోఫ్లేవిన్స్‌ అనే రసాయనాలు కేన్సర్ నుంచి రక్షణ కలిగించడంలో ఉపయోగపడతాయి.

బ్లడ్ లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపరిచే సామర్థ్యం సోయాపాలలో అధికంగా ఉంటుంది. రక్త ప్రవాహంలోకి కొలెస్ట్రాల్ రవాణాను నివారించడంలో సోయాలో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఉపయోగపడతాయి. రక్తనాళాల గాయాలను తగ్గించడంతో పాటు రక్తస్రావం నుంచి సమర్థవంతంగా కాపాడటంలో సోయా మిల్క్ ఉపయోగపడుతుంది. ఇందులో చక్కెర శాతం తక్కువగా ఉండటం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.

సోయా పాలు తాగడం వల్ల శరీరానికి అవసరమైన ఫైబర్ లభించడంతో పాటు ఈ పాలు తాగేవాళ్లకు ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ లేదా ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ తక్కువని చెప్పవచ్చు. సోయా పాలలో ఉండే ఫైటోఈస్ట్రోజెన్ మహిళలలో ఈస్ట్రోజెన్ ను భర్తీ చేయడంతో పాటు మెనోపాజ్ సమస్యలకు చెక్ పెట్టడంలో ఉపయోగపడుతుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Vijay Deverakonda Vs Naveen Polishetty

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...
Nagababu Jabardasth

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్...

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది 'జబర్దస్త్' మాత్రమే. ఈ బిగ్గెస్ట్...
Oktelugu Epaper