night shift workers: రాత్రి విధులు నిర్వహించే వారిలో ఈ లక్షణాలు ఉన్నాయా? అప్రమత్తం కాకపోతే అంతే సంగతులు..
నేటి కాలంలో ఎక్కువమంది కంప్యూటర్ల ముందు కూర్చునే వర్క్ చేస్తున్నారు. ఇందులోనూ చాలావరకు నైట్ షిఫ్టులే ఉంటున్నాయి. అయితే ఇలా రాత్రి విధులు నిర్వహించే వారిలో కొత్త ఆరోగ్య సమస్యలు ఉంటున్నట్లు కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరిలో బ్యాక్ పెయిన్, బోన్ పెయిన్, మజిల్స్ పెయిన్ తోపాటు అలసటగా ఉండడం.. ఏ పనిపై శ్రద్ధ లేకపోవడం వంటివి ఉంటున్నాయి. ఎందుకు కారణం డి విటమిన్ లోపం అని తెలుపుతున్నారు. అయితే ఈ లోపం ఎందుకు ఏర్పడుతుంది? డే విటమిన్ లోప నివారణకు ఏం చేయాలి?
రాత్రిళ్ళు ఎక్కువసేపు వర్క్ చేసేవారు ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తారు. మీరు నిద్రలేచేసరికి సూర్యుడి నుంచి వచ్చే ఉష్ణోగ్రత ఎక్కువగా మారుతుంది. ఇలాంటి సమయంలో బయటకు వెళ్లడానికి ఇష్టపడరు. ఆ తర్వాత మిగతా పనులతోనే కాలం గడిచి మళ్లీ సాయంత్రం సమయం గడుస్తుంది. ఈ విధంగా వీరు ఎక్కువసేపు ఇంట్లోనే లేదా కార్యాలయాల్లోనే గడుపుతూ సూర్యరష్మికి దూరంగా ఉంటున్నారు. ఈ కారణాలవల్ల వీరు డి విటమిన్ కు దూరమవుతున్నారు. ఆరోగ్య నిపుణులు తెలుపుతున్న ప్రకారం సూర్య రశ్మి నుంచి ఎక్కువగా డి విటమిన్ లభించే అవకాశం ఉంటుంది. నిత్యం ఎండలో పనిచేసే వారిలో ఈ లోపం కనిపించదు అని అంటున్నారు.
అయితే నైట్ షిఫ్ట్ చేసేవారు ఇలా ఎండకు దూరం కావడమే కాకుండా రకరకాల ఆహార పదార్థాలను సేవించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిలో ఎక్కువగా బాడీపెయిన్స్ ఉన్నట్లు కొందరు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి బోన్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఉన్నవారు ఆందోళన చెందుతూ అనవసరమైన మెడిసిన్స్ వాడుతూ ఉంటారని తెలుపుతున్నారు. ఇందులో భాగంగా ముందు జాగ్రత్తగా డి విటమిన్ లభించే ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు.
ఈ విటమిన్ ఎక్కువగా లభించే వాటిల్లో చేపలు, గుడ్లు, విటమిన్ డి పోర్టిఫైడ్ పాలు వంటివి తీసుకోవాలని అంటున్నారు. అయితే ఇది పరిమాణాన్ని బట్టి మాత్రమే తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు ఉదయం సూర్య రష్మి తగిలేలా ఎండలో ఉండే ప్రయత్నం చేయాలి. ఇదే సమయంలో స్వచ్ఛమైన నూనెను ఉపయోగించిన ఆహారాన్ని తీసుకోవాలి.
అయినప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాకపోతే వైద్యులను సంప్రదించాలి. అయితే కొందరు డి విటమిన్ ప్రత్యేకంగా లభించే టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. ఇలాంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో విధులు నిర్వహించేవారు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ముందు జాగ్రత్తగా కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.