spot_img
Homeఎంటర్టైన్మెంట్Karthika Deepam: పనిలో చేరిన వంటలక్క, డాక్టర్ బాబు.. ఇకపై సంతోషాలేనా?

Karthika Deepam: పనిలో చేరిన వంటలక్క, డాక్టర్ బాబు.. ఇకపై సంతోషాలేనా?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందంటే.. కార్తీక్ హోటల్ కు వెళ్లి భోజనం అడుగుతాడు. కానీ ఆ హోటల్ యజమాని కార్తీక్ తో వెటకారంగా పరువు తీసే విధంగా మాట్లాడుతాడు. అంతలోనే అక్కడున్న పనివాడు తను ఒక్కడే పనిచేస్తున్నాను అని కోపంతో విసిగెత్తుతాడు. ఆ మాట విని కార్తీక్ తాను ఈ పనిలో చేస్తాను అని ఒప్పందం తీసుకొని పిల్లలకు భోజనం తీసుకొని వెళ్తాడు.

పిల్లలు ఆకలితో అక్కడ మంచినీళ్లు తాగుతారు. అది చూసి కార్తీక్ బాధ పడతాడు. పిల్లల దగ్గరికి వెళ్లి భోజనం తినిపిస్తాడు. ఇక పిల్లలు కూడా తన తండ్రికి భోజనం తినిపిస్తారు. అక్కడ సీన్ బాగా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఇక దీప రుద్రాణి మాటలు తలుచుకొని ఆలోచనలో పడుతుంది. అక్కడే కార్తీక్ పనిచేస్తానని ఒప్పందం తీసుకున్న హోటల్ దగ్గరకి వెళ్తుంది.

ఇక ఆ హోటల్ యజమానికి తను తయారు చేసిన పిండి వంటలు రుచి చూపించడంతో ఆ యజమాని దీపకు కూడా పని ఇస్తాడు. కానీ దీప రుద్రాణి గురించి భయపడటంతో యజమాని రుద్రాణితో తనకు కూడా గొడవలు ఉన్నాయని చెప్పి ధైర్యం ఇస్తాడు. అంతలోనే అక్కడ్నుంచి కార్తీక్ రావడంతో అక్కడున్న పనివాడు కార్తీకును పక్కకు లాగి పనిలో చేర్పిస్తాడు. ఇక దీప యజమానికి సంతోషంగా ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. కానీ కార్తీక్ ను చూడలేకపోతుంది.

ఇక మరోవైపు సౌందర్య, ఆనందరావు మనశ్శాంతి కోసం ఓ చోట కి రెడీ అయ్యి బయలు దేరుతారు. అది చూసిన మోనిత వీరు ఎక్కడికి వెళ్తున్నారని ఆలోచనలో పడుతుంది. కార్తీక్ జాడ గురించి తెలిసిందేమో అని వాళ్లని ఫాలో అవ్వడానికి రెడీగా ఉంటుంది. మొత్తానికి కార్తీక్, దీప ఓకే దగ్గర పని లో చేరడంతో కలిసి పని చేసి రుద్రాణి అప్పు తీరుస్తారో లేదో చూడాలి.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
AP Rain Alert

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని చెప్పింది. పిడుగులతో కూడిన వానలు పడతాయని...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. విద్యార్థులకు బంపర్ ఆఫర్!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కానుంది. ఈనెల 1న ప్రారంభోత్సవానికి నోచుకోనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు....
Balakrishna

Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఇంటికి కూడా వెళ్తున్నాడుగా…

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులైతే రావు... స్టార్ డమ్ అనేది లభించదు. వాళ్ల సత్తాను చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం...
Oktelugu Epaper