Homeజాతీయ వార్తలుwomen reservation bill india : ఇంకెప్పుడు మహిళలకు రిజర్వేషన్.. మోదీని అదును చూసి దెబ్బ...

women reservation bill india : ఇంకెప్పుడు మహిళలకు రిజర్వేషన్.. మోదీని అదును చూసి దెబ్బ కొట్టిన ప్రతిపక్షాలు

women reservation bill india : ఈ బిల్లు చారిత్రాత్మకం.. దేశంలో ఉన్న మహిళలకు లభిస్తున్న గౌరవం.. ఇకపై వారు మరింత సాధికారత సాధించవచ్చు. చట్టసభల్లో మరింత సమున్నతంగా కొనసాగవచ్చు.. భారత మహిళలు మరింత అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాం.. ఇదీ మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభల్లోకి వచ్చే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ మహిళలను ఉద్దేశించి రాసిన లేఖ.

పార్లమెంట్లో విస్తృత సమావేశం

ఈ బిల్లు చర్చకు వచ్చే ముందు పార్లమెంట్లో విస్తృత సమావేశం జరిగింది. అధికార పక్షం నుంచి మొదలు పెడితే ప్రతిపక్షం వరకు నాయకులు తమ తమ వాణి వినిపించారు.. దీంతో చట్టసభల్లో మహిళ బిల్లు నెగ్గుతుందని.. మహిళలకు రిజర్వేషన్ వర్తిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ చారిత్రాత్మకమైన బిల్లు వీగిపోయింది. విపక్షాల ఐక్యత ముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం తలవంచింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. విపక్షాల ఐక్యత ముందు తలవంచక తప్పలేదు.

కేంద్రం అట్టర్ ఫ్లాఫ్

ఈ బిల్లు ఆమోదానికి మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలి. ఆ మెజారిటీని కూడగట్టడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైంది. దశాబ్దాలపాటు నెరవేరని కలగా ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు సహకారం కాలేదు.. శుక్రవారం పార్లమెంట్లో ఉత్కంఠ భరితమైన వాతావరణం మధ్య.. ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. సభకు మొత్తం 528 మంది హాజరయ్యారు. అనుకూలంగా 298 మంది మాత్రమే ఓటు వేశారు. మిగతా 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి నోచుకోవాలంటే కనీసం 352 మంది సభ్యులు ఆమోదం తెలపాలి. మ్యాజిక్ ఫిగర్ పొందడానికి 54 ఓట్లు అవసరం. అయితే వారంతా వ్యతిరేకంగా ఓటు వేయడంతో బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. దీంతో బిల్లును తిరస్కరించామని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు.

విపక్షాల అభ్యంతరాలు

మొదటినుంచి కూడా డీలిమిటేషన్ చేపట్టాలని నిబంధన పై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ అమలుకు ముందు దీనిని చేపట్టాలనే ప్రభుత్వ నిబంధన పై మండిపడుతున్నాయి.. “ఇప్పుడు మీరెందుకు రిజర్వేషన్ అమలు చేయడం లేదు? భవిష్యత్ కాలంలో నిర్వహించే డీలిమిటేషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇది మహిళలకు గర్వభంగాన్ని కలిగించే అంశమని” విపక్షాలు కేంద్రంపై మండిపడుతున్నాయి. అంతేకాదు కీలకమైన ఓటింగ్ సమయంలో విపక్షాలు మొత్తం ఏకతాటిపైకి వచ్చాయి. అంతేకాదు, మిత్రపక్షాలను కూడా కేంద్రం ఒప్పించలేకపోవడం నరేంద్ర మోడీ వైఫల్యానికి నిదర్శనం అని విశ్లేషకులు అంటున్నారు.

అప్రమత్తమైన కేంద్రం

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన తర్వాత.. కేంద్రం వెంటనే అప్రమత్తమైంది. మహిళా రిజర్వేషన్లతో సంబంధం ఉన్న డీ లిమిటేషన్ బిల్లు 2026, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్టాల సవరణ బిల్లులు మొత్తం వెనక్కి తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి ప్రకటించడం విశేషం. వాస్తవానికి బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం ఒకరకంగా బలహీనతను నిరూపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

విపక్షాలలో ఐక్యత

విపక్షాలు ఎన్నడూ లేనంతగా ఐక్యతను ప్రదర్శిస్తున్నాయి. దీనిని పసిగట్టడంలో అధికార పక్షం విఫలమైంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు అమలవుతాయా.. ఇంకా కొంతకాలం ఇలానే ఉంటుందా.. అనే సందిగ్ధం కొనసాగుతూనే ఉంది.

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ప్రభావం

కాకపోతే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు నోచుకోకపోవడంతో.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా మహిళల ప్రభావం ఎన్నికల మీద పడుతుందని తెలుస్తోంది. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లును ఇప్పటితోనే కేంద్రం నిలిపి వేస్తుందా.. ఎన్నికలకు ముందు కొత్త సొంతం ముందుకు వస్తుందా.. విపక్షాల ఒత్తిడికి తలవంచుతుందా.. డీలిమిటేషన్ నిబంధన తొలగించి.. తాజాగా కొత్త బిల్లు ప్రవేశపెడుతుందా.. ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Ranganath Controversy

Ranganath Controversy: ఆ భూమే.. హైడ్రా రంగనాథ్ కు ఇబ్బందికరం.. ఇంతకీ ఆ వివాదం ఏంటంటే..

Ranganath Controversy: హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ హైదరాబాద్ నగరంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. అక్రమార్కుల భరతం పడుతున్నారు. భూకబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నారు. ప్రభుత్వం ఆయనకు పూర్తి స్వేచ్ఛ...
HYDRA Ranganath

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ ను రేవంత్ వదులుకోరు.. ఎందుకంటే..

HYDRA Ranganath: హైకోర్టు వ్యాఖ్యల తర్వాత.. భారత రాష్ట్ర సమితి.. భారతీయ జనతా పార్టీ హ్యాపీగా ఉండవచ్చు. కొంతమంది కబ్జాదారులు కూడా సంతోషంగా ఉండవచ్చు. కానీ హైడ్రా రంగనాథ్ విషయంలో రేవంత్ రెడ్డి...
Hot vs Cold Shower

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...
Today 28 July 2026 Horoscope

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...
Oktelugu Epaper