Congress protest AI summit : అసలు కాంగ్రెస్ కు ఏమైందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇంతటి సిగ్గుమాలిన పని ఏ పార్టీ చేయదు. అంతర్జాతీయ వేదిక.. ఏఐ సమ్మిట్.. దాదాపు 100 దేశాలు సమ్మిట్ చేశాయి. 70 నుంచి 80 దేశాల వారు ఢిల్లీ డిక్లరేషన్ పై సంతకాలు చేశారు. 15-20 మంది హెడ్స్ ఆఫ్ స్టేట్స్ హాజరయ్యారు. 45 మంది గ్లోబల్ టెక్ సీఈవోలు హాజరయ్యారు. యూఎన్ఓ సెక్రటరీ, ఐఎంఎఫ్ చీఫ్ వచ్చారు.
ఇది పొలిటికల్ పార్టీ కాదు.. బీజేపీ, కాంగ్రెస్ ది కాదు.. ఇంతటి ప్రెస్టేజియస్ ఈవెంట్ జరుగుతుంటే కాంగ్రెస్ ఏమైపోయింది. ఏఐ అంతర్జాతీయ సమ్మిట్ లో భారత్ పరువు తీయాలా? మోడీ మీద గుడ్డి వ్యతిరేకతతో మీరు చేసింది ఎవరూ హర్షించరు. కేవలం యూత్ కాంగ్రెస్ నాయకులు వచ్చేసి షర్ట్ తీసేసి బనియన్ మీద సర్కస్ చేస్తారా? సెక్యూరిటీ వీరిని ఎందుకు లోపలికి పంపారో అర్థం కావడం లేదు. జనం దీన్ని భరించలేరు. అందులో పనిచేసే కార్మికులు వారిని తరిమితరిమి కొట్టారు. వారికి ఒక్కరూ కూడా మద్దతుగా రాలేదు.
అంతర్జాతీయ వేదికపై ఈ సిగ్గుమాలిన పనులేంటి రాహుల్ గాంధీ? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.