Homeజాతీయ వార్తలుSuvendu Adhikari Bengal politics : మమత అనుచరుడు.. అప్పుడు ఓడించాడు.. ఇప్పుడు అధికారాన్ని దూరం...

Suvendu Adhikari Bengal politics : మమత అనుచరుడు.. అప్పుడు ఓడించాడు.. ఇప్పుడు అధికారాన్ని దూరం చేశాడు..

Suvendu Adhikari Bengal politics : పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దాదాపుగా దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారు.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఆమె పార్టీకి ఓటమి తప్పలేదు. బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ పార్టీ ఓడిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైన వ్యక్తి పేరు సువేందు అధికారి. బెంగాల్ రాష్ట్రంలో ప్రజలకు ఇతడు అత్యంత సుపరిచితుడైన వ్యక్తి. ప్రజల్లో […]

Suvendu Adhikari Bengal politics : పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దాదాపుగా దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారు.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఆమె పార్టీకి ఓటమి తప్పలేదు.

బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ పార్టీ ఓడిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైన వ్యక్తి పేరు సువేందు అధికారి. బెంగాల్ రాష్ట్రంలో ప్రజలకు ఇతడు అత్యంత సుపరిచితుడైన వ్యక్తి. ప్రజల్లో పలుకుబడి బాగా ఉంది. అలాగని ఇబ్బంది పెట్టే రకం కాదు. హింసించే రకం అంతకంటే కాదు.

గతంలో మమత దగ్గర పని చేశాడు. ఒకరకంగా మమతకు అత్యంత దగ్గరైన వ్యక్తిగా ఉన్నాడు. మమత కూడా ఇతడిని బాగానే నమ్మేది. అయితే మమత కొన్ని విషయాలలో వ్యవహరిస్తున్న తీరు ఇతడికి అంతగా నచ్చేది కాదు. అందువల్లే అతడు తన అభిప్రాయాన్ని కొన్ని సందర్భాల్లో మొహమాటం లేకుండా చెప్పాడు. సహజంగా ప్రశ్నించే స్వభావాన్ని మమత ఒప్పుకోరు. అందువల్లే సువేందు ను పక్కన పెట్టారు. ఇది క్రమంలో బిజెపి అతని చేరదీసింది. ఫలితంగా మమతకు సమానమైన నాయకుడిగా ఎదిగేలా చేసింది.

గతంలో జరిగిన ఎన్నికల్లో ఇతడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. చివరికి అతడు మమతను ఓడించాడు. మమతకు కంచుకోట లాంటి నందిగ్రామ్ ప్రాంతంలో బరిలోకి దిగి.. ఆమెకు ఓటమిని పరిచయం చేశాడు. దీంతో ఉప ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గం నుంచి మమత పోటీ చేసింది. అక్కడి గెలిచి ఆమె తన సీటు నిలబెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు భవానిపూర్ లో కూడా అధికారి దూకుడు కొనసాగిస్తున్నాడు. ఇక్కడ కూడా మమతను ఓడించే అవకాశం కనిపిస్తోంది.

కొద్ది సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్లో అధికార టీఎంసీ కార్యకర్తల దాడులకు సువేందు ఏ మాత్రం భయపడలేదు. పైగా క్షేత్రస్థాయిలో బీజేపీని బలోపేతం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశాడు. అంతిమంగా బిజెపి మరింత బలపడే విధంగా చేశాడు. దీంతో బెంగాల్ రాష్ట్రంలో మమతకు ఇబ్బందులు తప్పలేదు. పైగా మమత బెంగాల్ రాష్ట్రంలో అనేక తప్పులు చేశారు. ఏకంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారికి పౌరసత్వం కల్పిస్తే తప్పేంటి అని వితండవాదం చేశారు. దీంతో ఈ పరిణామాలు బెంగాల్ రాష్ట్రంలో మమతకు పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయాయి. ఫలితంగా బిజెపికి అనుకూల మార్గాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ ఏర్పడేందుకు సువేందు కీలకపాత్ర పోషించారు. అందువల్లే ఇప్పుడు బెంగాల్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీడియాలో మార్మోగిపోతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper