Homeఎంటర్టైన్మెంట్Bollywood jealousy : ధురంధర్' అట్టర్ ఫ్లాప్ అవ్వాలని కోరుకున్న టాప్ డైరెక్టర్లు వీళ్ళే.. మరీ...

Bollywood jealousy : ధురంధర్’ అట్టర్ ఫ్లాప్ అవ్వాలని కోరుకున్న టాప్ డైరెక్టర్లు వీళ్ళే.. మరీ ఇంత అన్యాయమా..

Bollywood jealousy : మన సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే మొదటి నుండి బాలీవుడ్ కి చిన్న చూపు అనే సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదటి నుండి మనం గమనిస్తూనే ఉన్నాం. ఒకప్పుడు అంటే చిన్న చూపు, ఇప్పుడు మన ఎదుగుదల ని చూసి ఓర్వలేని తనం వాళ్ళ సొంతం. కేవలం సౌత్ ఇండియా మీదనే కాదు , బాలీవుడ్ లో కేవలం ఒక వర్గం చేతుల్లోనే ఇండస్ట్రీ ఉండాలి. కొత్తవాళ్లు పైకి వస్తే […]

Bollywood jealousy : మన సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే మొదటి నుండి బాలీవుడ్ కి చిన్న చూపు అనే సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదటి నుండి మనం గమనిస్తూనే ఉన్నాం. ఒకప్పుడు అంటే చిన్న చూపు, ఇప్పుడు మన ఎదుగుదల ని చూసి ఓర్వలేని తనం వాళ్ళ సొంతం. కేవలం సౌత్ ఇండియా మీదనే కాదు , బాలీవుడ్ లో కేవలం ఒక వర్గం చేతుల్లోనే ఇండస్ట్రీ ఉండాలి. కొత్తవాళ్లు పైకి వస్తే అసలు తట్టుకోలేరు. ఇప్పుడు బాలీవుడ్ సినీ పెద్దలంతా రణవీర్ సింగ్ ని చూసి కుళ్ళుకుంటున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి , ధురంధర్ సిరీస్ తో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్స్ ని అందుకొని , ఖాన్స్ కి సైతం సాధ్యపడని రికార్డ్స్ ని నెలకొల్పి సెన్సేషన్ సృష్టించాడు.

అందుకే ఈ సినిమా విజయం పట్ల బాలీవుడ్ ప్రముఖలంతా అసూయతో రగిలిపోతున్నారని , అమీర్ ఖాన్ తో ‘ఫనా’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తెరకెక్కించిన డైరెక్టర్ కునాల్ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ధురంధర్ చిత్రం ఇంత పెద్ద హిట్ అవ్వడం బాలీవుడ్ లోని కొంత మంది బడా దర్శకులకు అసలు ఇష్టం లేదు. విడుదలకు ముందే ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకున్నారు. ఒక బడా డైరెక్టర్ తో నేను ఫోన్ లో మాట్లాడినప్పుడు , ఈ సినిమా వీకెండ్ తర్వాత అసలు నిలబడదు , సోమవారం నుండి పడిపోతుందని అన్నాడు. సినిమా విడుదలై నెల రోజులు అయ్యింది , కానీ ఇప్పటికీ వసూళ్ల వర్షం ఆగడం లేదు. ఇది కచ్చితంగా అలాంటి కుళ్ళుబోతు డైరెక్టర్స్ కి కంటి మీద కునుకు లేకుండా చేసే విషయమే’ అంటూ చెప్పుకొచ్చాడు కునాల్. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు బాలీవుడ్ మీడియా లో చర్చనీయాంశంగా మారింది .

ఇకపోతే ‘ధురంధర్ 2’ చిత్రం మరి కొద్దిరోజుల్లోనే ఆల్ టైం టాప్ 2 బిగ్గెస్ట్ ఇండియన్ గ్రాసర్ గా నిలబడబోతుంది. 1800 కోట్ల రూపాయలకు అతి చేరువలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ‘బాహుబలి 2’ సాధించిన 1840 కోట్ల గ్రాస్ మార్కుని దాటి ఆల్ టైం టాప్ 2 చిత్రం గా నిలబడబోతుంది. విడుదలైన కొత్తల్లో కచ్చితంగా ‘దంగల్’ చిత్రాన్ని దాటేస్తుందని అంతా అనుకున్నారు కానీ , దంగల్ రికార్డు దాదాపుగా సేఫ్ అయ్యేలాగానే ఉంది. వచ్చే ఏడాది విడుదలయ్యే స్పిరిట్, లేదా వారణాసి చిత్రాలు మాత్రమే ఈ రికార్డు ని దాటగలదు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper