Vijaya Sai Reddy Amaravati : అమరావతి( Amravati capital ) రాజధానిపై సలహా ఇచ్చారు విజయసాయిరెడ్డి. ఇలా చేసేయండి అంటూ ఏకంగా సీఎం చంద్రబాబుకు సూచన చేశారు. మొన్నటివరకు మూడు రాజధానుల స్టాండ్ కు బలపరిచిన విజయసాయిరెడ్డి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తున్నారు. జగన్ మావిగన్ ప్రతిపాదన వేళ అమరావతిలో చేర్పులు మార్పులు సూచిస్తూ విజయసాయిరెడ్డి సూచన చేశారు. గత చరిత్రను గుర్తుచేస్తూ అమరావతికి ఇలా చేయండి అంటూ ఆయన సీఎం చంద్రబాబుకు సూచన చేశారు. వైసిపి హయాంలో అసలు జగన్మోహన్ రెడ్డికి సలహా ఇవ్వని విజయసాయిరెడ్డి.. ఆయన చెప్పిన మాదిరిగానే విశాఖ పాలన రాజధానిపై కీలక ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు అది పాతది అయిపోయినట్టు ఉంది విజయసాయిరెడ్డికి. అలాగని మావిగన్ ప్రతిపాదనకు మద్దతు తెలుపలేదు. అమరావతికి చేర్పులు మార్పులు చేస్తూ సూచనలు మాత్రం చేశారు.
* మహానగరాల వెనుక కథ చెప్పి.. విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) ఈరోజు ట్వీట్ చేశారు. బెంగళూరును 1737లో కెంపెగౌడ, హైదరాబాదును 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా, చెన్నైని 1639లో ఫ్రాన్సిస్ డే ఆధ్వర్యంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించాయని.. కానీ అవి మహానగరాలుగా మారేందుకు వందల సంవత్సరాలు పట్టిందని సాయి రెడ్డి గుర్తు చేశారు. ఈ నగరాలు హడావిడిగా నిర్మించలేదని.. తరతరాలుగా రూపుదిద్దుకున్నట్లు వెల్లడించారు. అమరావతిని కూడా అప్పుల డబ్బులతో, గొప్ప భ్రమలతో రాత్రికి రాత్రి నిర్మించలేమన్నారు. ముందుగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైన క్వార్టర్స్, ప్రాథమిక వసతులు కల్పించాలని సాయి రెడ్డి సలహా ఇచ్చారు.
* అప్పుడే చెప్పి ఉంటే..
కక్కలేక మింగలేక అన్నట్టు ఉంది సాయి రెడ్డి సూచన. ఇదే సాయి రెడ్డి వైసీపీలో ఉండేటప్పుడు విశాఖ రాజధాని మార్చలేరు అంటూ చెప్పుకొచ్చారు. కనీసం జగన్మోహన్ రెడ్డి ముందు నోరు కూడా అప్పట్లో తెరవ లేకపోయారు. అప్పుడే జగన్మోహన్ రెడ్డికి ఆ నాలుగు కార్యాలయ భవనాలు నిర్మించాలని సూచించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులు అన్నప్పుడు జై కొట్టింది ఈ విజయసాయిరెడ్డి. ఇప్పుడేమో జగన్ మావిగన్ అంటుంటే.. విజయసాయిరెడ్డి మాత్రం నాలుగు భవనాలు కట్టేయండి అంటూ కొత్త సూచనలు మొదలుపెట్టారు. పైగా అప్పులు అనే అంశాన్ని హైలైట్ చేస్తున్నారు. విజయసాయిరెడ్డి అమరావతిపై ఈ ప్రేమ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అన్నది నెటిజన్ల ప్రశ్న. సాయి రెడ్డి కి కావాల్సింది రాజకీయం. అందుకే వ్యవసాయం చేస్తానని చెప్పి మళ్ళీ ఇప్పుడు పాలిటిక్స్ మొదలుపెట్టారు. సాయి రెడ్డి మారరు మారలేరు అనే సెటైర్లు పడుతున్నాయి.
