Homeక్రీడలుక్రికెట్‌india vs pakistan t20 : ఇది టీమిండియా మాస్టర్ స్ట్రోక్.. లాల్ చౌక్ నుంచి...

india vs pakistan t20 : ఇది టీమిండియా మాస్టర్ స్ట్రోక్.. లాల్ చౌక్ నుంచి బలూచిస్థాన్ దాకా సంబరాలు..పాక్ లో పగిలిన టీవీలు..

india vs pakistan t20 : నెత్తి మాసిన పాకిస్తాన్.. తల పొగరు బంగ్లాదేశ్ మినహా.. ప్రపంచంలో అన్ని జట్లు భారత క్రికెట్ జట్టును ప్రేమిస్తాయి. ఆటగాళ్ల ఆట తీరును ప్రశంసిస్తాయి. అందువల్లే టీమిండియా గెలిస్తే.. ఆ గెలుపును తమ గెలుపుగా భావిస్తాయి. A Pakistani youtuber smashed cake on the face of his own sister after pakistan lost brutally to India #INDvsPAK pic.twitter.com/70xyakcRA5— Makya (@ccdx_2) February 15, […]

india vs pakistan t20 : నెత్తి మాసిన పాకిస్తాన్.. తల పొగరు బంగ్లాదేశ్ మినహా.. ప్రపంచంలో అన్ని జట్లు భారత క్రికెట్ జట్టును ప్రేమిస్తాయి. ఆటగాళ్ల ఆట తీరును ప్రశంసిస్తాయి. అందువల్లే టీమిండియా గెలిస్తే.. ఆ గెలుపును తమ గెలుపుగా భావిస్తాయి.

టి20 వరల్డ్ కప్ లో భాగంగా కొలంబోలో జరిగిన మ్యాచ్లో టీమిండియా పాకిస్తాన్ జట్టుపై అద్భుతమైన విజయం సాధించింది. ఈ విజయం టీం ఇండియా ప్లేయర్లకు కొండంత బలాన్ని ఇస్తే.. అభిమానులకు 1000 ఏనుగుల శక్తిని అందించింది. దీంతో టీమిండియా విక్టరీని అభిమానులు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో తమ ఆనందాన్ని రకరకాలుగా వ్యక్తం చేశారు.

జమ్ము కాశ్మీర్లోని లాల్ చౌక్ ప్రాంతంలో ప్రజలు మూకుమ్మడిగా బయటికి వచ్చారు. త్రివర్ణ పతాకాలతో ప్రదర్శన జరిపారు. జై భారత్.. జయహో భారత్ అంటూ నినాదాలు చేశారు..

అటు పాకిస్తాన్ ఏలుబడిలో ఉన్న బలుచిస్తాన్ ప్రాంతంలో కూడా ప్రజలు బయటికి వచ్చారు. పాకిస్తాన్ ఓటమి తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని వ్యాఖ్యలు చేశారు. రాత్రిపూట మంటలు వేసుకొని.. ఆ మంటల చుట్టు డాన్సులు వేశారు. ఒక రకంగా మన వద్ద భోగిమంటలు అయితే ఎలా జరుగుతాయో.. అక్కడ బలూచ్ ప్రజలు ఆ స్థాయిలో పండగ చేసుకున్నారు.

లాల్ చౌక్, బలుచ్ ప్రాంతంలో టీమిండియా విజయాన్ని పురస్కరించుకొని ప్రజలు పండగ చేసుకుంటే.. పాకిస్థాన్ మాత్రం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓ యూట్యూబర్ పాకిస్తాన్ ఓటమిని తట్టుకోలేక.. చిందులు తొక్కాడు. దారుణమైన మాటలు మాట్లాడాడు. పాకిస్తాన్ ప్లేయర్లను బండ బూతులు తిట్టాడు. చివరికి తన సోదరి మీద ఆగ్రహ వ్యక్తం చేశాడు. కోపాన్ని తట్టుకోలేక పక్కనే ఉన్న కేకును తన సోదరి ముఖం మీద పూసి.. ఆవేశంతో వెళ్లిపోయాడు.

పాకిస్తాన్ ఓటమి నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ఓ యువతి తన ఆగ్రహాన్ని తీవ్రస్థాయిలో వ్యక్తం చేసింది. టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడం తనకు నచ్చలేదని వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు పక్కనే ఉన్న టీవీని పగలగొట్టడానికి ప్రయత్నించింది. అయితే ఇంట్లో కుటుంబ సభ్యులు ఆమెకు సర్ది చెప్పడంతో నిశ్శబ్దంగా ఉండిపోయింది.

జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం కొన్ని ప్రాంతాలలో పాకిస్థాన్ ఓటమిని తట్టుకోలేక ఆ జట్టు అభిమానులు టీవీలను పగలగొట్టారని తెలుస్తోంది. భారత జట్టు చేతిలో ఓటమిని జీర్ణించుకోలేక వారు పాకిస్థాన్ ప్లేయర్లను బండ బూతులు తిట్టారని సమాచారం. ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్ ఓడిపోవడం బలూచ్ ప్రజలకు.. ఆఫ్ఘనిస్తాన్ పౌరులకు ఆనందాన్ని కలిగించిందంటే.. ఆ దేశం పట్ల అక్కడివారికి ఏ స్థాయిలో ఆగ్రహం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా పాకిస్తాన్ పాలకులు బుద్ధి తెచ్చుకుని.. సక్రమంగా వ్యవహరిస్తే బాగుంటుంది. లేకుంటే జనాగ్రహం మరింత పెరిగి పాకిస్తాన్ పాలకులకు చుక్కలు చూపించే ప్రమాదం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper