Homeక్రీడలుSuryakumar Yadav : అయ్యర్ కు కెప్టెన్సీ.. మేనేజ్మెంట్ పై సూర్య ఆగ్రహం.. క్లారిటీ

Suryakumar Yadav : అయ్యర్ కు కెప్టెన్సీ.. మేనేజ్మెంట్ పై సూర్య ఆగ్రహం.. క్లారిటీ

Suryakumar Yadav : నేటి సోషల్ మీడియా కాలంలో ఇదిగో పులి అంటే.. అదిగో తోక అన్నట్టుగా సాగుతోంది ప్రచారం. నిజాలు, అబద్దాలతో సంబంధం లేదు.. ప్రచారం ఉంటే చాలు.. దాన్ని నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు.. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ విషయంలో కూడా ఇలానే జరుగుతుంది. టీమిండియా టి20 సారధిగా మొన్నటిదాకా కొనసాగిన అతడిని.. మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. అతని స్థానంలో అయ్యర్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. అయ్యర్ […]

Suryakumar Yadav : నేటి సోషల్ మీడియా కాలంలో ఇదిగో పులి అంటే.. అదిగో తోక అన్నట్టుగా సాగుతోంది ప్రచారం. నిజాలు, అబద్దాలతో సంబంధం లేదు.. ప్రచారం ఉంటే చాలు.. దాన్ని నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు.. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ విషయంలో కూడా ఇలానే జరుగుతుంది.

టీమిండియా టి20 సారధిగా మొన్నటిదాకా కొనసాగిన అతడిని.. మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. అతని స్థానంలో అయ్యర్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. అయ్యర్ నాయకత్వంలో టీం ఇండియా ఐర్లాండ్ జట్టు మీద సిరీస్ కోల్పోయింది. తొలిసారిగా వైట్ వాష్ కు గురైంది. ఇంగ్లాండ్ గడ్డమీద కూడా టీం ఇండియా ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతోంది. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయితే.. రెండవ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచింది. వాస్తవంగా ఈ మ్యాచ్లో ఇండియా గెలవాలి. కానీ బౌలింగ్ లోపం వల్ల టీమిడియా ఓటమిపాలైంది.

అయ్యర్ కు కెప్టెన్సీ ఇవ్వడంతో సూర్య కుమార్ యాదవ్ మేనేజ్మెంట్ మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోచ్ గంభీర్ మీద మండిపడ్డాడు. అంతేకాదు, త్వరలోనే జట్టు నుంచి అతడు బయటికి రాబోతున్నాడు.. ఇదిగో ఇలా జరుగుతోంది సోషల్ మీడియాలో ప్రచారం. పైగా దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వీడియోలు సూర్య కుమార్ యాదవ్ కంటపడ్డాయి. దీంతో ఆయన స్పందించక తప్పలేదు.

” జట్టు ఎంపిక విషయంలో ఎప్పటికీ సానుకూల దృక్పథంతోనే ఉంటాను. దేశం కోసం ఆడాను. దేశం గొప్పగా ఉండాలని భావిస్తాను. దేశం కోసం ఆడతాను. దేశానికి సంబంధించి ఎప్పటికీ నేను మద్దతు ఇస్తూనే ఉంటాను. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న వీడియో నా దృష్టికి వచ్చింది. అదంతా కూడా ఫేక్. నకిలీ వార్తలను నాకు భాగస్వామ్యం ఆపాదించకూడదు. ఇండియన్ క్రికెట్.. తోటి ప్లేయర్లకు నా సపోర్ట్ ఉంటూనే ఉంటుంది” అని సూర్య కుమార్ యాదవ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకువచ్చారు.

Suryakumar Yadav

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper