WPL 2025 : ఈసారి జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ బెంగళూరు జట్టుకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఈసారి బెంగళూరు జట్టు అద్భుతంగా ఆడింది. బీభత్సంగా బ్యాటింగ్ చేసింది. అదే స్థాయిలో బౌలింగ్ చేసింది. ఫీల్డింగ్ విషయంలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పింది. ఫలితంగా ఈసారి సీజన్ లో రెండోసారి విజేతగా నిలిచింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రెండుసార్లు విజేతగా నిలిచిన చరిత్ర ముంబై జట్టుకు ఉంది. ఈసారి ముంబై జట్టు గ్రూప్ దశను కూడా అధిగమించలేకపోయింది. ఉత్తరప్రదేశ్ ముందుగానే ఎగ్జిట్ అయింది. గుజరాత్, ఢిల్లీ ప్లే ఆఫ్ దాకా వెళ్ళిపోయాయి. అయితే ఈ జట్లకు లీగ్ సమరంలో చివరి మ్యాచ్ లలో ఒత్తిడి ఎదుర్కొక తప్పలేదు. మిగతా జట్ల పరిస్థితి ఒక విధంగా ఉంటే.. బెంగళూరు జట్టు పరిస్థితి మాత్రం మరో విధంగా ఉంది. వరుసగా ఐదు మ్యాచ్లో గెలిచింది. అంతేకాదు ప్లే ఆఫ్ ను ముందుగానే ఖరారు చేసుకుంది. ఎక్కువ విజయాలు సాధించి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. అదే జోరులో ఫైనల్ దాకా వెళ్ళింది. ఫైనల్ పోరులో ఏకంగా 200 కు మించిన పరుగుల లక్ష్యాన్ని ఫినిష్ చేసి సత్తా చాటింది. తమది అదృష్టవశాత్తు ఇక్కడ దాక వచ్చిన జట్టు కాదని.. కష్టం నమ్ముకుని వచ్చిన జట్టు అని నిరూపించింది.
ఈ సీజన్లో బెంగళూరు జట్టు బీభత్సంగా ఆడింది. మొత్తంగా తొమ్మిది మ్యాచ్లలో ఏడింట్లో విజయాలు అందుకుంది. సాధించిన ఏడు విజయాలు కూడా బెంగళూరు జట్టు తుది వరకు పోరాడి అందుకుంది. లీగ్ స్థాయిలో అత్యధిక పరుగులు ఆ జట్టు కెప్టెన్ స్మృతి బ్యాట్ నుంచి వచ్చాయి. ఇక బౌలింగ్ లో కూడా టాప్ 10 బౌలర్లలో నలుగురు బెంగుళూరు జట్టు అమ్మాయిలు ఉండడం విశేషం.
ఈ సీజన్ ప్రారంభంలో ముంబై జట్టు మీద అంచనాలు భారీగా ఉండేది. కానీ ఆ జట్టులో ప్లేయర్లు సరిగా ఆడలేకపోయారు. కెప్టెన్ హార్మన్ అదరగొడుతున్నప్పటికీ.. మిగతా ప్లేయర్ల నుంచి సపోర్ట్ లేకపోవడంతో ముంబై జట్టు లీగ్ దశ నుంచే వెళ్లిపోయింది. ఈ టోర్నీ ప్రారంభం నుంచి కర్ణాటక జట్టు స్థిరమైన ప్రదర్శన చేసింది. ఫైనల్ వరకు కూడా అదే జోరు కొనసాగించింది. అందువల్లే బెంగళూరు రెండోసారి విజేతగా నిలిచింది.