Homeక్రీడలుక్రికెట్‌WPL 2026 : స్మృతి ఆయుధం ఈమె.. ఈ డబ్ల్యూ పి ఎల్ లో ఎన్ని...

WPL 2026 : స్మృతి ఆయుధం ఈమె.. ఈ డబ్ల్యూ పి ఎల్ లో ఎన్ని డాట్ బాల్స్ వేసిందో తెలుసా?

డబ్ల్యూపిఎల్ అనేది వేగంతో కూడుకున్న ఆట. ఇలాంటి ఆటలో బౌలర్ కట్టుదిట్టంగా బంతులు వేయాలంటే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. పైగా కొన్ని సందర్భాలలో ఎంత తోపు బౌలర్ అయినప్పటికీ పరుగులు ఇవ్వాల్సి వస్తుంది.

ప్రస్తుతం జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఒక బౌలర్ మాత్రం అదరగొడుతోంది. ఈమె పరుగులు ఇవ్వడంలో కాదు.. డాట్ బాల్స్ వేయడంలో పోటీ పడుతోంది. తద్వారా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో బ్యాటర్ల వేగానికి ముకుతాడు వేయవచ్చని నిరూపిస్తోంది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్ గా లారెన్స్ బెల్ రికార్డు సృష్టించింది. తొమ్మిది మ్యాచ్లలో.. ఆమె ఏకంగా 35 ఓవర్ల పాటు బౌలింగ్ వేసింది. 193 పరుగులు ఇచ్చింది. ఇందులో 12 వికెట్లు ఆమె తన ఖాతాలో వేసుకుంది. ఏకంగా 127 డాట్ బాల్స్ లేసింది. ఈమె యావరేజ్ 16.8 గా ఉండగా.. ఎకానమీ 5.51 గా నమోదయింది. స్ట్రైక్ రేట్ 17.50 గా ఉంది.

రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ మెరిజైన్ కాప్ కొనసాగుతోంది. తొమ్మిది మ్యాచ్లలో 36 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన ఈమె.. 218 పరుగులు ఇచ్చింది. 10 వికెట్లు సొంతం చేసుకుంది. 112 డాట్ బాల్స్ వేసింది. ఈమె యావరేజ్ 21.80 గా, ఎకనామి 6.6 గా, స్ట్రైక్ రేట్ 21.60 గా నమోదయింది.

మూడో స్థానంలో శబ్నం ఇస్మాయిల్ కొనసాగుతోంది. ఈమె ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఆడుతోంది. ఏడు మ్యాచ్లలో 28 ఓవర్ల పాటు బౌలింగ్ వేసింది. 173 పరుగులు ఇచ్చింది. ఇందులో ఆమె ఖాతాలో ఆరు వికెట్లు ఉన్నాయి. డాట్ బాల్స్ 93 ఉన్నాయి. యావరేజీ 28.83, ఎకానమీ 6.18, స్ట్రైక్ రేట్ 28 గా నమోదయింది.

నాలుగో స్థానంలో గుజరాత్ బౌలర్ రేణుక సింగ్ ఠాకూర్ కొనసాగుతోంది. ఈమె 9 మ్యాచ్లలో 27 ఓవర్ల పాటు బౌలింగ్ వేసింది. 219 పరుగులు చేసింది. 7 వికెట్లు సొంతం చేసుకుంది. 79 డాట్ బాల్స్ వేసింది. ఈమె యావరేజ్ 31.29 గా, ఎకానమీ 8.1 గా, స్ట్రైక్ రేటు 23.14 గా నమోదయింది.

ఐదో స్థానంలో సోఫీ డివైన్ కొనసాగుతోంది. ఈమె గుజరాతి జట్టులో ఆడుతోంది. తొమ్మిది మ్యాచ్లలో 32.5 ఓవర్ల పాటు బౌలింగ్ వేసింది. 272 పరుగులు ఇచ్చింది. 17 వికెట్లు పడగొట్టింది. 79 డాట్ బాల్స్ వేసింది. యావరేజ్ 16, ఎకానమీ 8.28, స్ట్రైక్ రేట్ 11.59గా నమోదయింది.

అయితే వీరందరిలో బెల్ అద్భుతంగా బౌలింగ్ వేసింది. అందువల్లే ఈమె మొదటి స్థానంలో కొనసాగుతోంది. అంతేకాదు బెంగళూరు సాధించిన విజయాలలో ఈమె కీలకపాత్ర పోషించింది. ఫలితంగా బెంగళూరు సారధి స్మృతి ఈమెకు బౌలింగ్ దళం బాధ్యతలను అప్పగించింది. ఫైనల్ మ్యాచ్లో కూడా బెల్ అద్భుతంగా బౌలింగ్ వేస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular