Homeఆధ్యాత్మికంToday horoscope in telugu 6.2.2026 : లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ రాశి వ్యాపారులకు లాభాలే...

Today horoscope in telugu 6.2.2026 : లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు..

Today horoscope in telugu : గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ద్వాదశ రాశులపై హస్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు లక్ష్మీదేవి కటాక్షం ఉండనుంది. ఫలితంగా అధిక లాభాలు పొందనున్నారు. మరికొన్ని రాశుల వారు ప్రయాణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు తోటి వారి సహాయం తీసుకోవాలి. పెద్దల సలహాతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారులకు లాభాలు ఉంటాయి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉండగలుగుతారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉంటుంది. అయినా కూడా సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది. ఉద్యోగులు కొత్తగా ప్రాజెక్టులను చేపడతారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఇతరులకు డబ్బు విషయంలో వాగ్దానాలు ఇవ్వద్దు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వాటి పరిష్కారానికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఇంట్లో జరిగే శుభకార్యం కోసం సిద్ధమవుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్తగా ప్రాజెక్ట్లను చేపడతారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి ఉద్యోగులు ఈరోజు శుభవార్తలు వింటారు. వీరు చేసే కొన్ని పనులకు తోటి వారి సహాయం ఉంటుంది. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టేవారు ఇతరుల సహాయం తీసుకుంటారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మధ్యత ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు లాభాలు పొందుతారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు అన్ని రంగాల్లో రాణిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. గతంలో వేసిన ఆర్థిక ప్రణాళికలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ప్రయత్నాలు చేయొద్దు. ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఎవరికి అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. పోటీ పరీక్షలో పాల్గొంటే రాణిస్తారు. ఇతరులతో వ్యాపారం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. ఇవి పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులకు లక్ష్మీదేవి కటాక్షం ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు అనేక ప్రయోజనాలు పొందుతారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. సొంత వాహనాలపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూలమైన వాతావరణము ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular