RCB: ఐపీఎల్ 2025 లో ట్రోఫి విజయం తర్వాత జూన్ 4న చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కర్ణాటకస్టేట్ క్రికెట్ అసోసియేషన్ పై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించడగా 56 మంది గాయపడ్డారు. ఆర్సీబీ, ఈవేంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ, కేఎస్సీఏ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.