RCB Sale: దాదాపు 17 సంవత్సరాల దాకా ఎదురు చూస్తే.. ట్రోఫీ సొంతమైంది. దీంతో ప్రపంచాన్ని జయించినంత ఆనందంతో కన్నడ జట్టు సంబరాలు జరుపుకోవడానికి ప్రణాళికలు రూపొందించింది. దానికి తగ్గట్టుగానే విజయ యాత్ర నిర్వహిస్తామని ప్రకటించింది. యాత్ర నిర్వహించే క్రమంలో ఏర్పాట్లు సరిగా చేయలేకపోవడం.. అభిమానుల సంఖ్యను అంచనా వేయలేకపోవడంతో విజయ యాత్ర విషాదయాత్రగా మిగిలిపోయింది. దాదాపు పదికి మించి అభిమానుల ప్రాణాలను బలిగొన్నది. ఇక గాయపడిన వారి సంఖ్య దాదాపు 60 దాటిపోయింది. వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రాజకీయంగా కూడా ఇది కర్ణాటక ప్రాంతాన్ని రచ్చ రచ్చ చేసింది. అన్ని వైపులా నుంచి ఒత్తిడి అధికంగా రావడంతో అరెస్టుల పర్వం మొదలైంది.. ఇక విచారణ కూడా వేగంగా సాగుతోంది. ఒకవేళ జరిగిన దారుణంలో కన్నడ జట్టు మేనేజ్మెంట్ పాత్ర గనుక ఉంటే అప్పుడు పోలీసులు వేసే అడుగులు వేరే విధంగా ఉంటాయి. ఇప్పటికే ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడిన చెన్నై, రాజస్థాన్ జట్లపై ఐపీఎల్ నిర్వాహక కమిటీ ఏకంగా రెండు సంవత్సరాలపాటు నిషేధాన్ని విధించింది. ఇక ఇప్పుడు గనక జరిగిన దారుణంలో కన్నడ జట్టు పాత్ర కనుక ఉన్నట్టు తేలితే.. కచ్చితంగా నిషేధం విధిస్తారని ప్రచారం జరుగుతోంది.. అయితే దీనిపై ఐపీఎల్ నిర్వాహక కమిటీ ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ.. పోలీసులు కూడా ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఇప్పటికైతే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తదుపరి ఏం జరుగుతుందనేది అంతుపట్టకుండా ఉంది.
విక్రయిస్తుందా?
ఇటీవల ట్రోఫీ గెలిచి కన్నడ అభిమానుల మనసులో స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది బెంగళూరు జట్టు.. ఈ క్రమంలో ఆ జట్టు బ్రాండ్ వాల్యూ అమౌంట్ పెరిగినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీని విలువ ఎంత పెరిగింది అనేది చూడాల్సి ఉంది.. ఐపీఎల్ విజేతకు సాధారణంగానే విలువ అమాంతం పెరుగుతుంది. దానికి తోడు యాడ్ రెవెన్యూ కూడా ఎక్కువవుతుంది. అలాంటప్పుడు ఈ జట్టులో పెట్టుబడులు పెట్టడానికి.. ఇతరత్రా వ్యవహారాలు కొనసాగించడానికి కంపెనీలు ముందుకు వస్తాయి. సరిగా ఇలాంటి అనుభవం బెంగళూరు యాజమాన్యానికి ఎదురైంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేటట్టు.. ఇన్నాళ్లపాటు ట్రోఫీ లేక.. విజేత కాలేకపోయినా కన్నడ జట్టు.. ఇప్పుడు ఏకంగా సరికొత్త ప్రణాళికలను రూపొందించింది.. కన్నడ జట్టులో ఫ్రాంచైజీ మొత్తాన్ని అమ్మడం లేదా కొంత షేర్ విక్రయించడానికి యాజమాన్యం నిర్వహించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరు జట్టు విలువ రెండు బిలియన్ డాలర్లు అంటే 16 వేల కోట్ల వరకు ఉంటుందని బ్లూ మ్ బర్గ్ అంచనా వేసింది. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీ బ్రిటిష్ డిస్టిలర్, యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ పేరెంటింగ్ కంపెనీ అయినటువంటి “డియా జియో పీఎల్సీ” ఆధీనంలో ఉంది.. ఇటీవల జరిగిన వివాదం.. తదుపరి పరిణామాల వల్ల యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇక గతంలో బెంగళూరు జట్టు యజమాని విజయ్ మాల్యా కూడా.. ఇటీవల ఒక యూట్యూబర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తనకు అవకాశం ఇస్తే మళ్లీ ఆర్సిబి ని కొనుగోలు చేస్తానని ప్రకటించారు. ఒకవేళ ప్రస్తుతం ఉన్న కంపెనీ ఈ జట్టును గనుక అమ్మితే.. బినామీలతో విజయ్ మాల్యా జట్టును కొనుగోలు చేయించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని మార్కెట్ నిపుణులు అంటున్నారు.