Yash Dayal : క్రికెటర్లు వివాదాల్లో చిక్కుకోవడం తరచూ మనం చూస్తూనే ఉంటాం. మీడియాలో వచ్చే వార్తల ద్వారా వింటూనే ఉంటాం. వాస్తవానికి ఒక స్థాయి వచ్చిన తర్వాత ఆటగాళ్లు ఆకాశంలో ఉంటారు. స్వర్గంలో విహరిస్తూ ఉంటారు. తాము సెలబ్రిటీలమని.. ఏం చేసినా చెల్లుతుందని భావనలో ఉంటారు. కానీ ఒక్కసారిగా సీన్ రివర్స్ అయితే మాత్రం లేనిపోని మాటలు చెబుతుంటారు. తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి రకరకాల కథలు అల్లుతారు. కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం జరుగుతుంది కాబట్టి క్రికెటర్లు ఎంత మొత్తుకున్నా ఉపయోగం ఉండదు. ఇటీవల మహమ్మద్ షమీ ఉదంతంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత కోర్టు తీర్పు మేరకు ఆయన భరణం చెల్లించాల్సి వచ్చింది. షమీ కేసు మీడియాలో సృష్టించిన సంచలనాన్ని మర్చిపోకముందే.. మరో ఆటగాడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఐపీఎల్ లో బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న యష్ దయాళ్ పీకల్లోతు ఆరోపణలలో కూరుకుపోయాడు. ఓ యువతి చేసిన ఆరోపణలు అతడిని తీవ్ర వివాదంలో కూరుకుపోయేలా చేశాయి. తనను ప్రేమించాడని.. పెళ్లి చేసుకుంటానని చెప్పాడని.. అన్ని విధాలుగా వాడుకొని.. పెళ్లి అని చెప్పగానే వదిలేశాడని.. ఆ యువతి పేర్కొంది. అంతేకాదు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దానికి తగ్గట్టుగా ఆధారాలు కూడా పోలీసులకు అందజేసింది. దీంతో పోలీసులు బెంగళూరు క్రికెటర్ పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తన మీద వస్తున్న ఆరోపణలకు.. నమోదైన కేసు పై యష్ స్పందించాడు.
” నాపై కొద్ది రోజులుగా మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ వార్తలకు స్పందించకూడదు అనుకున్నాను. కానీ నిజాలు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందువల్లే ఈ విషయాలు చెబుతున్నాను. నాపై ఆరోపణలు చేస్తున్న యువతికి ఐఫోన్ కొనిచ్చాను. లక్షల్లో నగదు అప్పుగా ఇచ్చాను అయితే ఇప్పటివరకు ఆమె తిరిగి ఇవ్వలేదు. ఆమె కుటుంబ సభ్యుల చికిత్స పేరుతో డబ్బులు అడిగింది. షాపింగ్ పేరుతో కూడా నన్ను తీసుకెళ్లింది. డబ్బులు మొత్తం కాజేసింది. వీటన్నింటికీ నా వద్ద ఆధారాలు ఉన్నాయి. నేను పెళ్లి పేరుతో ఆమెను మోసం చేయలేదు. ప్రేమ పేరుతో దగ్గర కాలేదని” యష్ వెల్లడించాడు. అయితే ఎటువంటి పరిచయం లేకుండా ఆమెకు ఫోన్ ఎలా కొనిచ్చాడు.. డబ్బులు ఎందుకు ఇచ్చాడు అనే విషయాలపై యష్ క్లారిటీ ఇవ్వలేదు. మరవైపు ఆ యువతి పూర్తి ఆధారాలతోనే తమకు ఫిర్యాదు చేసిందని పోలీసులు చెబుతున్నారు. ఆ ఆధారాలను పరిశీలించిన తర్వాతే కేసు నమోదు చేశామని పోలీసులు వివరిస్తున్నారు.
యష్ కూడా తన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ఐఫోన్, లక్షల డబ్బులు అనే విషయాన్ని మాత్రమే ప్రస్తావించిన బెంగళూరు క్రికెటర్.. ఆ అమ్మాయితో తనకు పరిచయం ఎలా ఏర్పడింది? అది ఐఫోన్ కొనుగోలు చేసేదాకా ఎలా వెళ్ళింది? లక్షల నగదు అప్పు ఇచ్చేదాకా ఎలా ఎదిగింది? అనే ప్రశ్నలకు మాత్రం అతడు సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో యష్ చెప్పిన మాటలకు సార్ధకత లేకుండా పోయింది. దీంతో యష్ అబద్ధాలు ఆడుతున్నాడని అభిమానులు ఆరోపిస్తున్నారు. అతడి తీరు సరిగా లేదని.. తప్పు చేయకపోతే దానికి తగ్గట్టుగా ఆధారాలు చూపించి నిర్దోషి లాగా బయటపడాలని పేర్కొంటున్నారు.