Bengaluru Stampede: నచ్చిన ఆటగాళ్లను మెచ్చుకోవడం.. మైదానంలో ఆడుతుంటే చప్పట్లు కొట్టడం.. విజయం సాధిస్తే అభినందించడానికి రావడమే వారు చేసిన పాపం అయింది. వారు ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 10కి మించి ప్రాణాలు పోయాయి. దాదాపు 50కి పైగా అభిమానులకు గాయాలయ్యాయి. వాళ్ళు ఎప్పటిలోగా కోలుకుంటారో తెలియదు. ప్రస్తుతానికి అయితే వారికి చికిత్స అందిస్తున్నారు. కొందరు అత్యవసరవి వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు. మొత్తంగా ఈ ఘటన కన్నడ సీమలో పెనువిషాధాన్ని నింపింది. ఈ ఘటన పై అన్ని విధాలుగా విమర్శలు రావడంతో.. ప్రభుత్వం రంగంలోకి దిగింది. పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో అరెస్టుల పర్వం మొదలైంది. ఇక ఈ ఘటనకు సంబంధించి ఒక్కొక్కటిగా సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.. ఇక ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి సంబంధించి ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ. అవన్నీ కూడా కన్నీరు పెట్టిస్తున్నాయి. గుండెను బరువెక్కిస్తున్నాయి. “అసలు వారు ఏం పాపం చేశారని.. ఎలాంటి దారుణాలకు పాల్పడ్డారని.. ఇలాంటి ఇబ్బందులకు ఇతరులను గురి చేశారని ఇలాంటి శిక్షలు ఎదుర్కొన్నారు.. చూస్తుండగానే ప్రాణాలను కోల్పోయారు.. అయినవాళ్లు ఎంత బాధ పడుతున్నారో.. కన్నవాళ్ళు ఎంత ఆవేదనను అనుభవిస్తున్నారో” అంటూ నెటిజన్లు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.
తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారిలో 20 సంవత్సరాల భూమిక్ అనే యువకుడు ఉన్నాడు.. ఇతడిది హసన్ జిల్లా.. భూమిక్ తండ్రి ఒక వ్యాపారి.. అతడు భారీగా ఆస్తి సంపాదించాడు. భూమిక్ ఒక్కడే కొడుకు కావడంతో దాదాపు 100 కోట్ల వరకు ఆస్తి సంపాదించాడు. భూమిక్ స్థానికంగా ఉన్న కార్పొరేట్ కాలేజీలో చదువుతున్నాడు. మరి కొద్ది రోజులైతే తమ వ్యాపారాలలోకి వస్తాడనుకుంటున్న సందర్భంలో.. అనుకోకుండా బెంగళూరు వెళ్ళిపోయాడు. తన ఆరాధ్య కన్నడ జట్టు ప్లేయర్లను చూసేందుకు వెళ్లాడు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డాడు. ఊపిరి ఆడక చనిపోయాడు. చెట్టంత కొడుకు.. చేతికి అంది వచ్చిన కొడుకు చనిపోవడంతో అతడి తండ్రి కన్నీటి పర్యంతమవుతున్నాడు. తన కొడుకును ఖననం చేసిన చోట గుండెలు పగిలే విధంగా రోదిస్తున్నాడు..” కొడకా నన్ను వదిలి వెళ్ళిపోయావా. మీ అమ్మకు ఎలా సమాధానం చెప్పాలి. ఆమెను ఏమని ఓదార్చాలి. 100 కోట్ల ఆస్తిపెట్టాను.. లేవరా.. నన్ను నాన్న అని పిలవరా” అంటూ భూమిక్ తండ్రి విలపిస్తున్న తీరు హృదయాలను ద్రవింపజేస్తోంది. భూమిక్ తండ్రిది మాత్రమే కాదు.. ఆ ఘటనలో చనిపోయిన వారందరి కుటుంబాల పరిస్థితి కూడా దాదాపు ఇలాగనే ఉంది. రోజులు గడుస్తున్నా కొద్దీ ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ కేసు కు సంబంధించి ఇప్పటికే దర్యాప్తు మొదలైంది.
కొడుకా.. లేవరా, 100 కోట్ల ఆస్తి పెట్టాను
బీటెక్ విద్యార్థి భూమిక్ తండ్రి రోదన
యశవంతపుర: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన హాసన్ జిల్లా వాసి భూమిక్ (20) ఇంటిలో చెప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చి విగతజీవి అయ్యాడు.భూమిక్ మృతితో తండ్రి తల్లడిల్లిపోతున్నారు pic.twitter.com/J7R0FPI9YV
— Bhaskar Reddy (@chicagobachi) June 7, 2025